జాతీయ వార్తలు

‘బాజీరావు మస్తానీ’కి 9 ఫిలిమ్ ఫేర్ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 16: సంజయ్ లీలా బన్సాలీ తీసిన ‘బాజీ రావ్ మస్తానీ’ చిత్రం ఈ ఏడాది ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో సగం అవార్డులను ఎగరేసుకు పోయింది. శుక్రవారం రాత్రి ప్రకటించిన అవార్డుల్లో ఆ చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమగాయని ఉత్తమ కొరియోగ్రాఫీ సహా మొత్తం తొమ్మిది అవార్డులను దక్కించుకుంది. కాగా, ‘పికు’ చిత్రంలో నటనకు గాను దీపికా పదుకోనెకు ఉత్తమ నటి అవార్డు లభించింది. అదే చిత్రంలో నటించిన అమితాబ్ బచన్‌కు ఉత్తమ నటుడిగా క్రిటిక్స్ అవార్డు లభించింది. ఒకే చిత్రానికి ఇద్దరు నటులు పాపులర్, క్రిటిక్స్ విభాగాల్లో అవార్డులను దక్కించుకోవడం గమనార్హం. బ్లాక్, దేవదాస్ సినిమాల తర్వాత సంజయ్ లీలా బన్సాలీకి చెందిన సినిమా ఇన్ని ఫిలిమ్‌ఫేర్ అవార్డులను దక్కించుకోవడం విశేషం. బ్లాక్ సినిమాకు 11, దేవదాస్ సినిమాకు పది అవార్డులు లభించాయి. ఖాన్ త్రయం (షారుక్, సల్మాన్, అమీర్ ఖాన్)లో ఏ ఒక్కరికీ ఉత్తమ నటుడి అవార్డు దక్కకపోవడం బహుశా ఇటీవలి సంవత్సరాల్లో ఇదే మొదటిసారి కావచ్చు. బాజీరావ్ మస్తానీలో నటించిన రణవీర్ సింగ్ ఉత్తమ నటుడి అవార్డును దక్కించుకోగా, అదే చిత్రంలో నటించిన ప్రియాంక చోప్రాకు ఉత్తమ సహాయ నటి అవార్డు దక్కింది. శ్రేయా ఘోసల్‌కు ఉత్తమ నేపథ్య గాయని అవార్డు దక్కగా, బిర్జు మహరాజ్‌కు ఉత్తమ కొరియోగ్రఫీ అవార్డు లభించింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ‘బాజీరావ్ బజరంగి’ సినిమాకు ఒకే ఒక అవార్డు దక్కింది. ఉత్తమ కథకు గాను కె విజయేంద్ర ప్రసాద్ ఈ అవార్డును దక్కించుకున్నాడు. కాగా, వౌసమీ చటర్జీకి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. క్రిటిక్ చాయిస్ ఉత్తమ నటి అవార్డును ‘తన వెడ్స్ మను రిటర్న్స్’లో నటించిన కంగనా రనౌత్ దక్కించుకోగా, ఉత్తమ నేపథ్య గాయకుడు అవార్డు అరిజిత్ సింగ్‌కు దక్కింది.