జాతీయ వార్తలు

పర్యావరణమే ప్రథమ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 17: రోడ్లపై పొగలు చిమ్ముతూ ఇతర వాహనదారులకు ఇబ్బందికరంగా మారడమేకాకుండా, కాలుష్యానికి, ప్రమాదాలకు కారణమవుతున్న కాలం చెల్లిన వాహనాలకు ఇక చెల్లు చీటీ తప్పదేమో! కాలుష్య కారకాలయ్యే కాలం చెల్లిన వాహనాలకు చెల్లు చీటీ పలికే ఒక పథకాన్ని వచ్చే బడ్జెట్‌లో ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ పథకం కింద కాలుష్య కారకాలయ్యే తమ పాత వాహనాలను సరెండర్ చేసి కొత్త వాహనాలను కొనుగోలు చేసే వాహన యజమానులకు ఆ వాహనాలపై భారీఎత్తున ఎక్సైజ్ డ్యూటీలో రాయితీ లభిస్తుంది. ఇదేకాకుండా కాలుష్య రహిత వాహనాలను తయారు చేయడానికి అదనపు పెట్టుబడులను పెట్టే ఆటోమొబైల్ పరిశ్రమలకు కూడా బడ్జెట్‌లో కొన్ని ప్రోత్సాహకాలను ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. స్క్రాప్‌గా మార్చడం కోసం పాత కాలుష్య కారక వాహనాలను సరెండర్ చేసే వాహనదారులకు కొత్త వాహనాల కొనుగోలుపై ఎక్సైజ్ డ్యూటీలో కనీసం 50 శాతం రాయితీ ఇవ్వాలని రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించి ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు కాలుష్యం గణనీయంగా తగ్గడానికి దోహదపడుతుందని గడ్కరీ జైట్లీకి చెప్పినట్టు తెలుస్తోంది. పర్యావరణహిత వాహనాలను తీసుకోవడానికి అదనపు పెట్టుబడులు పెట్టే ఆటోమొబైల్ పరిశ్రమదారులకు కూడా ప్రోత్సాహకాలను ప్రకటించాల్సిన అవసరం ఉందని గడ్కరీ ఆర్థిక మంత్రిత్వ శాఖకు సూచించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. రెండు రోజుల క్రితం (సంక్రాంతి రోజున) జైట్లీ బడ్జెట్ ముందు చర్చల్లో భాగంగా గడ్కరీని కలిశారు.
కర్బన ఉద్గారాల ప్రమాణాలకు సంబంధించిన బిఎస్-5 నిబంధనలను వదిలిపెట్టి ఒకేసారి బిఎస్-6 నిబంధనలకు మారడం చాలా సవాళ్లతో కూడుకున్నదని వాహన తయారీ పరిశ్రమలు వాదిస్తున్నప్పటికీ, 2020 ఏప్రిల్ నాటికల్లా అత్యంత కఠినమైన కర్బన ఉద్గారాల నిబంధనలను అమలు చేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో గడ్కరీ, జైట్లీకి ఈ సూచనలు చేశారు. 2020 నాటికి దేశం కఠినమైన ఉద్గారాల నిబంధనలకు మారేటప్పటికి దేశమంతటా అలాంటి ఇంధనం లభించేలా చూడాలని కూడా పరిశ్రమ వర్గాలు కేంద్రాన్ని కోరాయి.
కాలుష్యకారక పాతవాహనాలకు చెల్లు చీటీ పాడే విధానానికి సంబంధించి సరెండర్ చేసే పాతవాహనాలకు ప్రోత్సాహకాలకు ఓ విధానాన్ని రూపొందించడం జరుగుతోందని, దాన్ని త్వరలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపించడం జరుగుతుందని గడ్కరీ జైట్లీకి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ పథకం కింద కార్లులాంటి చిన్న వాహనాలను వదులుకొనే వారికి రూ.30 వేల దాకా ఎక్సైజ్ సుకంలో రాయితీ లభిస్తుంది. ట్రక్కులు లాంటి భారీ వాహనాల విషయంలో అయితే అన్ని పన్ను రాయితీలు కలుపుకొని లక్షన్నర రూపాయల దాకా రాయితీ లభిస్తుందని గడ్కరీ చెప్పారు. దేశవ్యాప్తంగా పదేళ్లకు పైబడిన వాహనాలన్నిటికీ ఈ విధానం వర్తిస్తుందని తెలిపారు. ‘ఉదాహరణకు మీరు ఒక పాతవాహనం అమ్మినప్పుడు మీకు ఒక సర్ట్ఫికెట్ ఇస్తారు. కొత్త వాహనం కొనేటప్పుడు ఆ సర్ట్ఫికెట్‌ను ఇస్తే మీకు రూ.50 వేల రూపాయల దాకా డిస్కౌంట్ లభిస్తుంది’ అని గడ్కరీ ఇటీవల చెప్పారు. కార్లులాంటి చిన్న వాహనాలకయితే ఈ రాయితీ 30 వేలదాకా ఉంటుంది. ఇదే కాకుండా మరికొన్ని ఇతర పన్ను రాయితీలు కూడా ఉంటాయి. ట్రక్కులులాంటి భారీ వాహనాలకైతే మొత్తం రాయితీ లక్షన్నర దాకా ఉంటుందని గడ్కరీ చెప్పారు. పాత వాహనాలను తీసుకుని దేశీయ, విదేశీ వాహనాలను రీసైక్లింగ్ చేయడానికి కాండ్లా లాంటి రేవుల వద్ద 8-10 పరిశ్రమలను ఏర్పాటు చేయాలనేది ఈ పథకం ఉద్దేశం. దీనివల్ల వాహన తయారీ పరిశ్రమకు భారీగా ప్రయోజనం చేకూరడమే కాక ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయని గడ్కరీ అభిప్రాయ పడుతున్నారు. దేశంలో నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తూ, కాలుష్య కారకాలయవుతున్న పాత వాహనాలను రీసైక్లింగ్ చేయాల్సిన అవసరం ఎంతయినా ఉందని కూడా గడ్కరీ అభిప్రాయ పడుతున్నారు. ఈ పథకాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖకు సిపార్సు చేయబోతున్నామని, దీనివల్ల వాహన యజమానులు తమ పాత వాహనాలను వదిలించుకుని అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఉండే కొత్త వాహనాలను కొనుగోలు చేయడం సులభమవుతుందని కూడా మంత్రి చెబుతున్నారు.