జాతీయ వార్తలు

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌పై యువతి సిరా దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 17: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై ఒక యువతి సిరా దాడికి పాల్పడింది. ఢిల్లీ రోడ్లపైకి ఒకరోజు సరి సంఖ్య గల వాహనాలను, మరో రోజు బేసి సంఖ్య గల వాహనాలను అనుమతిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం విజయవంతం కావడంతో ప్రజలకు కృతజ్ఞతలు తెలియడానికి ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన సభలో ఈ సంఘటన జరిగింది. సభలో కేజ్రీవాల్ ప్రసంగిస్తుండగా సుమారు 20 ఏళ్ల వయసున్న ఆ యువతి అతని ముందున్న స్టాండ్ వద్దకు చేరుకుంది. తరువాత కొన్ని పత్రాలను ఆయనకు చూపించింది. ఆ తరువాత కొద్దిసేపటికి ముఖ్యమంత్రిపై సిరా పోసింది. కొన్ని సిరా చుక్కలు ముఖ్యమంత్రి మీద పడ్డాయి. అతని ముందున్న స్టాండ్‌పై కూడా సిరా మరకలు కనపడ్డాయి. ఈ హఠాత్మరిణామానికి విస్తుపోయిన పోలీసులు వెంటనే తేరుకొని ఆ యువతిని అక్కడి నుంచి పక్కకు లాక్కెళ్లారు. అయితే, ఆ యువతి వద్ద ఉన్న పత్రాలను స్వీకరించి, ఆమెను వెళ్లిపోనివ్వాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు. ఈ సంఘటనతో ముఖ్యమంత్రి ఉపన్యాసానికి కొంతసేపు అంతరాయం కలిగింది. సుమారు ఏడు నిమిషాల అంతరాయం తరువాత కేజ్రీవాల్ తిరిగి తన ఉపన్యాసాన్ని కొనసాగించారు. ఉపన్యాసం ముగిసిన తరువాత తనపై సిరా చల్లిన యువతి సమస్యలను పరిశీలించి, పరిష్కరించాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.