జాతీయ వార్తలు

ప్రాజెక్టుల పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: ప్రైవేట్ సంస్థల ద్వారా రైల్వే ప్రాజెక్టులు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏర్పాటవుతున్న జెవిసిల సారథ్యంలో స్పెషల్ పర్పస్ వెహికిల్స్ ద్వారా ప్రాజెక్టులు పూర్తి చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టుల సత్వరాభివృద్ధికి రైల్వే శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడిన జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటుకు మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ (ఎంవోయు) కుదిరింది. రైల్వే శాఖ, ఆంధ్రప్రదేశ్ మధ్య కుదిరిన ఎంవోయుపై రాష్ట్ర రవాణా శాఖ సలహాదారు శ్రీవాస్తవ, రైల్వే శాఖ సీనియర్ అధికారి విపి దుడేజా ఒప్పందాలపై బుధవారం సంతకాలు చేశారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు సమక్షంలో జరిగిన సంతకాల కార్యక్రమానికి రైల్వే, ఆంధ్ర ప్రభుత్వానికి చెందిన పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఒప్పందాల ప్రకారం రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన వనరుల సమీకరణ, భూసేకరణ, పథకాల అమలు, కీలక ప్రాజెక్టుల పర్యవేక్షణ వంటి కార్యక్రమాలు జెవిసి నిర్వహిస్తుందని సురేష్ ప్రభు వెల్లడించారు. రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాల్లో నిధుల కొరత అధిగమించేందుకు రాష్ట్రాలతో కలిసి జెవిసిల ఏర్పాటుకు గత ఏడాది రైల్వే బడ్జెట్‌లో మంత్రి సురేష్ ప్రభు ప్రతిపాదించటం తెలిసిందే. రైల్వే శాఖ 17 రాష్ట్రాలతో ఇలాంటి ఒప్పందాలు కుదర్చుకోనుంది. ఇప్పటికే ఒడిశా, మహారాష్టల్రతో ఒప్పందాలు జరిగాయి. తాజాగా ఆంధ్ర, కేరళతో ఎంవోయులు కుదుర్చుకుంది. జెవిసిలో ప్రభుత్వ వాటా 51, రైల్వే వాటా 49 శాతం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో పని చేసే జెవిసి, రాష్ట్రంలో చేపట్టాల్సిన ప్రాజెక్టులను గుర్తించటంతోపాటు, వాటి నిర్మాణానికి అవసరమయ్యే వనరుల సేకరణనూ నిర్ధారిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు ఇతర వనరుల నుంచి సేకరించాల్సిన నిధుల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తుంది. ప్రాజెక్టుల నిర్మాణానికి స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏర్పాటు అంశాన్నీ జెవిసి చూస్తుంది. స్పెషల్ పర్పస్ వెహికల్‌లో ప్రైవేట్ కంపెనీలకు స్థానం కల్పిస్తారు. రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి ఏర్పాటు చేసే స్పెషల్ పర్పస్ వెహికల్‌లో జెవిసి వాటా 26శాతం తప్పకుండా ఉండాలని నిర్ణయించారు. ప్రాజెక్టులు చేపట్టే ఎస్పీవీ కంపెనీలకు 30 ఏళ్లపాటు రాయితీలు కల్పిస్తారు. ఇందులో ప్రాజెక్టు నిర్వహణ, ఆదాయం పంపకాలు, సాంకేతిక పరిజ్ఞానం అందించటం, మార్కెటింగ్ తదితర అంశాలుంటాయి. ఆదాయ పంపిణీకి ప్రస్తుతం అమల్లోవున్న పద్ధతినే పాటిస్తారు. రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన భూమి మాత్రం జెవిసి పరిధిలోనే ఉంటుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. 30ఏళ్ల గడువు ముగిసిన అనంతరం ప్రాజెక్టును రైల్వే శాఖ నామమాత్రపు రుసుం చెల్లించి తమ పరిధిలోకి తీసుకుంటుంది. రైల్వే శాఖ రెండు వేల కిలోమీటర్ల కొత్త లేన్ల నిర్మాణం చేపట్టటంతోపాటు నాలుగు వేల కిలోమీటర్ల గేజ్ మార్పిడి చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. 11 వేల కిలోమీటర్ల రైల్వే లేన్లను డబ్లింగ్, ట్రిప్లింగ్, క్యాడ్రుప్లింగ్‌గా ఐదేళ్లలో మార్చాలని లక్ష్యం పెట్టుకుంది.
శ్రీవాస్తవ వివరణ
ఆంధ్ర కొత్త రాజధాని అమరావతిని ఇతర ప్రాంతాలతో కలిపేందుకు అవసరమైన కొత్త రైల్వే లేన్ల నిర్మాణం తదితర పనులను ఎస్పీవీ ద్వారా సునాయాసంగా సాధించవచ్చని శ్రీవాస్తవ చెప్పారు. కొత్త రాష్ట్రానికి అవసరమైన అన్ని రైల్వే అవసరాలూ వీటితో తీరతాయన్నారు. కృష్ణపట్నం తదితర రేవులకు రైల్వే లేన్ సౌకర్యం దీంతోనే సాధ్యమన్నారు.

చిత్రం... రైల్వే మంత్రి సురేష్ ప్రభు సమక్షంలో ఆంధ్ర, కేరళ రాష్ట్రాలతో చేసుకున్న
ఒప్పందాల పత్రాలు అందుకుంటున్న రైల్వే అధికారులు