జాతీయ వార్తలు

పారిశ్రామికవేత్తలతో భేటీలు మంచివే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: భారత ప్రధాని లేదా ఆర్థిక మంత్రి పారిశ్రామికవేత్తలను వ్యక్తిగతంగా కలవ వచ్చా? రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తాజాగా విడుదలైన తన ఆత్మకథలో ఈ ప్రశ్న వేశారు. అంతేకాదు పారిశ్రామిక వేత్తలతో వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా తాను జరిపిన సమావేశాలు చాలా ముఖ్యమైనవని పేర్కొనడం ద్వారా ఆ ప్రశ్నకు ఆయనే సమాధానం కూడా చెప్పారు. దేశంలో అనేక సామాజిక, రాజకీయ ప్రకంపనలకు కారణమైన 1998, 1991 మధ్య కాలాన్ని ఆయన ఆ పుస్తకంలో ప్రధానంగా ప్రస్తావిస్తూ రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన విపి సింగ్, తాను అనుసరించిన వైఖరుల్లో ఉన్న తేడాలను ఉదహరించారు. ‘ఉదాహరణకు ఆర్థిక మంత్రిగా ఆయన పారిశ్రామికవేత్తలను ముఖాముఖి కలుసుకోవడానికి ఎంతమాత్రం ఇష్టపడే వారు కాదు. నిర్దిష్ట కోణంలో మొత్తం పరిస్థితిని అర్థం చేసుకోవడానికి పారిశ్రామికవేత్తలతో వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా సమావేశాలు చాలా ముఖ్యమని నా అభిప్రాయం. ఆర్థికమంత్రిగా, వాణిజ్య మంత్రి పని చేసినప్పుడు నేను అదే పద్ధతిని పాటించాను’ అని ఆయన అన్నారు. మరోవిధంగా చెప్పాలంటే ప్రధాని కానీ, ఆర్థిక మంత్రి కానీ పారిశ్రామికవేత్తలను కలవకుండా ఎలా ఉంటారు? అని కూడా ‘ది టర్బులెంట్ ఇయర్స్- 1980- 1996’ పేరుతో రాసిన తన ఆత్మకథలో ప్రణబ్ అన్నారు. 1982 జనవరినుంచి 1984 డిసెంబర్ వరకు ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉండగా 1982 సెప్టెంబర్ 16నుంచి 1985 జనవరి 14 వరకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా ఉన్నారు.ఆ సమయంలో ప్రణబ్‌కు, మన్మోహన్‌కు మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయని పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. ఆ విషయాన్ని ప్రణబ్ తన పుస్తకంలో ప్రస్తావిస్తూ ఆర్‌బిఐ గవర్నర్‌గా మన్మోహన్ నిష్క్రమణలో తన పాత్ర ఏమీ లేదని స్పష్టం చేశారు. తమ మధ్య ఏవయినా విభేదాలున్నా అవి వృత్తిపరమైన అంశాలపై వ్యక్తమయిన భిన్నాభిప్రాయాలు మాత్రమేనని కూడా ఆయన చెప్పారు. నిజానికి ఆర్థిక మంత్రికి, ఆర్‌బిఐ గవర్నర్‌కు మధ్య ఉండే సంబంధాలు చాలా సంక్లిష్టమైనవని, అన్ని విషయాల్లోను ఆ ఇద్దరి అభిప్రాయాలు ఒకే విధంగా ఉండడం అసాధ్యమని కూడా ప్రణబ్ అభిప్రాయ పడ్డారు.