జాతీయ వార్తలు

శీతాకాలంలోనే భానుడి భగభగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: దేశంలో ఈ ఏడాది శీతాకాలం గతంలో ఎన్నడూ లేనంత వేడిగా ఉంది. నవంబర్ నుంచి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే ఎంతో అధికంగా నమోదవుతుండటంతో కేవలం ఉత్తర భారతావనిలోనే కాకుండా దేశమంతటా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. జనవరిలోనూ ఉష్ణోగ్రతలు సాధరణ స్థాయి కంటే ఎంతో ఎక్కువగా ఉన్నాయని, ఫిబ్రవరిలోనూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ లక్ష్మణ్ సింగ్ రాథోర్ స్పష్టం చేశారు. ఈ ఏడాది శీతాకాలంలోనే వేడిమి పరిస్థితులు నెలకొనడానికి ‘ఎల్-నినో’ ప్రభావంతోపాటు పసిఫిక్ సముద్ర జలాలు వేడెక్కడం ప్రధాన కారణాలని శాస్తవ్రేత్తలు స్పష్టం చేస్తున్నారు. రెండో ఏడాది కూడా నైరుతి రుతుపవనాల్లో లోటు ఏర్పడటంతో ఈ ఏడాది శీతాకాలం దేశ వ్యాప్తంగా వాతావరణ కేంద్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే ఎంతో అధికంగా నమోదయ్యాయి. దీంతో ఈసారి జనవరిలో ఉత్తర భారతావనిలోనే కాకుండా దేశవ్యాప్తంగా శీతాకాలం గతంలో ఎన్నడూ లేనంత వేడిగా ఉందని, ఫిబ్రవరిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని, అంతేకాకుండా పగటి సమయం కూడా క్రమేణా పెరిగి రేడియేషన్ (రేడియో ధార్మికత) పెరుగుదలకు దారితీస్తుందని, తద్వారా ఉష్ణోగ్రతల స్థాయిపై ప్రతికూల ప్రభావం పడుతుందని రాథోర్ వివరించారు. అయితే దీనిపై శీతాకాల సీజన్ ముగిసిన తర్వాత గానీ తుది అభిప్రాయానికి రాలేమని ఆయన అన్నారు.