జాతీయ వార్తలు

ప్రైవేట్ అన్ ఎయిడెడ్ మెడికల్ కాలేజీల సీట్ల భర్తీపై జోక్యానికి నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: రెండు తెలుగు రాష్ట్రాల్లో మెడికల్, డెంటల్ కాలేజీ మేనేజిమెంట్ల సంఘం బి కేటగిరీ సీట్ల భర్తీకి ఉద్దేశించి ఏపి అన్ ఎయిడెడ్ నాన్ మైనార్టీ వృత్తి విద్యా సంస్ధల నిబంధనల విషయంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పైన పేర్కొన్న విద్యా సంస్థల పరిధిలో మెడికల్, డెంటల్ వృత్తి విద్యా కోర్సుల క్రమబద్ధీకరణ, అడ్మిషన్ల విధానాలకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పును జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఏ శంకర్ నారాయణ్ వెలువరించారు. రెండు రాష్ట్రాల నిర్ణయాలను సవాలు చేస్తూ ఏపి బిసి సంక్షేమ సంఘం, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏ సంపత్‌కుమార్ దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఏపి ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్ 17వ తేదీన ఈ విద్యా సంస్ధల్లో అడ్మిషన్లకు సంబంధించి జీవో జారీ చేసింది. మెడికల్ కోర్సుకు 11 లక్షల రూపాయల ఫీజు, డెంటల్ కాలేజీ కోర్సుకు రూ.4.5 లక్షల ఫీజును సాలీనా చెల్లించాలని జీవో జారీ చేశారు. 2015-16 సంవత్సరం నుంచి ప్రైవేట్ అన్ ఎయిడెడ్ నాన్‌మైనార్టీ కాలేజీలు ఈ ఫీజును వసూలు చేసేందుకు ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ కాలేజీ మేనేజిమెంట్లు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు. ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది మే 20వ తేదీన జీవో జారీ చేసింది. మెడికల్ సీటుకు 9 లక్షల రూపాయలు, డెంటల్ కాలేజీకి 4 లక్షల రూపాయల ఫీజును నిర్ణయించారు. ఈ కేసులో దాఖలైన పిల్‌లో రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కాగా ఈ కాలేజీల్లోని ఏ కేటగిరీ సీట్లకు మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయని రెండు రాష్ట్రప్రభుత్వాలు వాదించాయి. బి, సి కేటగిరీలో రిజర్వేషన్ వర్తించదని హైకోర్టుకు తెలిపాయి. ఉభయ పక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు పిల్‌ను కొట్టేసింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని కోర్టు పేర్కొంది.