జాతీయ వార్తలు

ఇక పంచాయతీల్లో సగం సీట్లు మహిళలకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లను 50 శాతానికి పెంచడం కోసం ప్రభుత్వం వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాజ్యాంగ సవరణను తీసుకు వస్తుంది. అంతేకాకుండా మహిళా అభ్యర్థులకు వార్డుల రిజర్వేషన్లను ఇప్పుడున్న ఒక టెర్మ్‌నుంచి రెండు టెర్మ్‌లకు పెంచే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ‘పంచాయతీ చట్టం 1996 (షెడ్యూల్డ్ ఏరియాలకు కూడా విస్తరింపు-పిఎస్‌ఇఏ) అమలు: సమస్యలు, ముందున్న మార్గం’ అనే అంశంపై గురువారం ఇక్కడ ప్రారంభమైన రెండు రోజుల జాతీయ వర్క్‌షాపులో కేంద్ర గ్రామీణాభివృద్ధి, తాగునీరు, శానిటేషన్ మంత్రి బీరేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఈ నెల 23న ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఈ మేరకు సవరణలు తీసుకు వస్తుందని చెప్పారు. ‘ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో మహిళలకోసం వార్డు రిజర్వేషన్ అయిదేళ్ల కాలానికి ఉంది. అయితే మహిళలు ప్రజా సేవ చేయడానికి మరింత ఉత్సాహం చూపించడానికి అలాగే మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి దీన్ని రెండు టెర్మ్‌లకు (అంటే పదేళ్లకు) పెంచాలని యోచిస్తున్నాం’ అని ఆయన చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను 50 శాతానికి పెంచడం గురించి మాట్లాడుతూ, ‘రాబోయే పార్లమెంటు సమావేశంలోనే సవరణ తీసుకు వస్తామని ఆశిస్తున్నాం’ అని ఆయన చెప్పారు. అంతేకాదు, ఈ చర్యను ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించక పోవచ్చని కూడా ఆయన అన్నారు. రాజ్యాంగం 73 సవరణ చట్టం ప్రకారం ప్రస్తుతం పంచాయతీల్లో మహిళలకు మొత్తం సీట్లలో 33 శాతం రిజర్వేషన్ ఉంది.
ఇదిలా ఉండగా వితంతు పింఛను ఇవ్వడానికి మహిళల వయోపరిమితిని తగ్గించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోందని సింగ్ చెప్పారు. ప్రస్తుతం 40 ఏళ్ల పైబడిన వితంతువులు మాత్రమే పింఛనుకు అర్హులు. అయితే ఈ ఆలోచనకు సంబందించి ఎలాంటి వివరాలను వెల్లడించడానికి మంత్రి నిరాకరిస్తూ, ప్రస్తుతం ఇది ప్రారంభ దశలోనే ఉందన్నారు. కాగా, గిరిజనుల సముద్ధరణ కోసం ‘పిసా’ చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్రాలను మంత్రి గట్టిగా కోరుతూ, గిరిజనులు అభివృద్ధి కోసం ఇక ఎంతమాత్రం వేచి ఉండలేరన్నారు. దేశంలోని గిరిజనులు ఇప్పటికీ తమ ఆచార వ్యవహారాలు, సంస్కృతికి కట్టుబడి ఉండడాన్ని మంత్రి ప్రశంసిస్తూ ప్రపంచంలోని మిగతా ప్రాంతాల్లో జరిగినట్లుగా సామ్రాజ్యవాద శక్తులు వారిని తుడిచిపెట్టలేక పోవడానికి అదే కారణమన్నారు. కాగా, ఈ చట్టం అమలు దిశగా గత 20 ఏళ్లలో తీసుకున్న తొలి చర్య ఈ వర్క్‌షాపని కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి నిహాల్ చంద్ చెప్పారు. పది రాష్ట్రాలకు చెందిన పంచాయతీరాజ్, గిరిజనాభివృద్ధి శాఖల మంత్రులు ఈ వర్క్‌షాపులో పాల్గొంటున్నారు.