జాతీయ వార్తలు

రెండు వారాల్లోగా సమాధానమివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులపై రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలకు జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ నోటీసులు జారీ చేసింది. తమ నోటీసులకు రెండు వారాలలోగా సమాధానం ఇవ్వాలని గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను గ్రీన్ ట్రైబ్యునల్ మార్చి ఏడో తేదీకి వాయిదా వేసింది. కేంద్ర పర్యావరణ విభాగం రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను సవాల్ చేస్తూ మాజీ ఐఎఎస్ అధికారి ఇఎఎస్ శర్మ ట్రైబ్యునల్‌లో దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం జస్టిస్ స్వతంత్ర కుమార్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. రాజధాని నిర్మాణాలపై దాఖలైన పిటిషన్లు అన్నింటిపై ఒకేసారి విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. మాజీ ఐఎఎస్ అధికారి శర్మ, పర్యావరణవేత్త శ్రీమన్నారాయణతో పాటు మరో పిటిషనర్ కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి ఇచ్చిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ ఎన్‌జిటిలో పిటిషన్లు దాఖలు చేశారు.