జాతీయ వార్తలు

23నుంచి పార్లమెంట్ 25న రైల్వే.. 29న సాధారణ బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ఈ నెల 23 నుంచి ప్రారంభించాలని పార్లమెంటరీ వ్యవహారాల ఉపసంఘం నిర్ణయించింది. ఫిబ్రవరి 25న రైల్వే బడ్జెట్‌ను, మరుసటి రోజు ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 29న సాధారణ బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రతిపాదిస్తారు. హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నాయకత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల ఉపసంఘం ఈ రోజు పార్లమెంటులో సమావేశమై ఈ మేరకు నిర్ణయించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. ఉపసంఘంలో రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీతోపాటు మంత్రులు నజ్మా హెప్తుల్లా, రాంవిలాస్ పాశ్వాన్, స్మృతి ఇరానీ, ముక్తార్ అబ్బాస్ నఖ్వి సభ్యులు. ఫిబ్రవరి 23న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు మధ్యలో విరామంతో మే 13వ తేదీ వరకు కొనసాగుతాయి. పార్లమెంటు సమావేశాలకు మార్చి 17 నుంచి ఏప్రిల్ 24 వరకు కొనసాగే విరామ సమయంలో వివిధ శాఖలకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చలు జరుపుతాయి. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఫిబ్రవరి 23న పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించటంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా మొత్తం 81 రోజుల పరిధిలో పార్లమెంటు ఉభయ సభలు 31మార్లు సమావేశం అవుతాయని వెంకయ్య నాయుడు చెప్పారు. వెంకయ్య నాయుడు మొదట పార్లమెంటు ఆవరణలోని తమ చాంబర్‌లో రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, ఉపనాయకుడు ఆనంద్ శర్మ, దీపేందర్ హుడ్డా, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జెడి (యు) అధినాయకుడు శరద్ యాదవ్, కె.సి.త్యాగి, బర్తృహరి మహతామ్ (బిజెడి), అంబత్ రాజన్ (బిఎస్‌పి), డెరిక్ ఒబ్రేన్ (టిఎంసి), డాక్టర్ వేణుగోపాల్ (ఏఐఏడిఎంకె), ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమై బడ్జెట్ సమావేశాలను సజావుగా నిర్వహించటం గురించి చర్చించారు. కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగవలసి ఉన్నందున పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండు దఫాలుగా కాకుండా ఒకే దఫాగా నిర్ణయించుకుందామని ప్రతిపాదించిగా, ప్రతిపక్షాలు తిరస్కరించినట్లు తెలిసింది.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ఎప్పటి మాదిరిగానే రెండు దఫాలుగా నిర్వహించాలని ప్రతిపక్షం సూచించింది. ఈ ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఐదేళ్ల క్రితం బడ్జెట్ సమావేశాలలోని విరామ సమయాన్ని తొలగించారు. ఇప్పుడు అవే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నందున ఈసారి కూడా విరామ సమయాన్ని తొలగించాలని వెంకయ్య నాయుడు ప్రతిపాదించగా ప్రతిపక్షం నిరాకరించినట్లు తెలిసింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధించటం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో దళిత పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చర్చకు రానున్నాయి. రోహిత్ వేముల ఆత్మహత్యపై బడ్జెట్ సమావేశాలను స్తంభింపజేయాలన్నది విపక్షం ఆలోచనలా కనిపిస్తోంది.

పార్లమెంటరీ వ్యవహారాల ఉపసంఘం భేటీ అనంతరం వెలుపలకు వస్తున్న
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ముక్తార్ అబ్బాస్ నఖ్వి తదితరులు

సైనికుల జాడకోసం
గాలింపు ముమ్మరం
కొనసాగుతున్న సహాయక చర్యలు
బతికి ఉండే అవకాశాలు మృగ్యం
జమ్ము, ఫిబ్రవరి 4: హిమాలయాల్లోని సియాచిన్ హిమనదం ప్రాంతంలో సంభవించిన హిమపాతంలో చిక్కుకుపోయిన సైనిక జవాన్ల జాడ కోసం గాలింపు ముమ్మరం చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, టన్నుల కొద్దీ మంచు సైనిక శిబిరంపై పడటంతో వారి ఆచూకీ కనుగొనడం కష్టసాధ్యంగా మారింది. ఈ ఘటన జరిగి 24 గంటలు దాటిపోయిన నేపథ్యంలో జవాన్లు ప్రాణాలతో మిగిలి వుంటారన్న ఆశ సన్నగిల్లింది. అయినా వారి ఆచూకీ కనుగొనేందుకు సైన్యం ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగింది. నిపుణులైన బృందాలు ఆధునిక సామగ్రితో సియాచిన్‌కు చేరుకున్నాయి. వాతావరణం ప్రతికూలంగా ఉన్నా సహాయ బృందాలు జవాన్ల ఆచూకీ పనిలో నిమగ్నమయ్యాయని రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ గోస్వామి వెల్లడించారు. సైన్యం, వైమానిక సిబ్బంది గురువారం ఉదయం సియాచిన్ హిమనదం ప్రాంతానికి చేరుకున్నారని ఆయన తెలిపారు. లడఖ్‌లోని ఉత్తర హిమనదం వద్ద 19,600 ఎత్తులో ఉన్న సైనిక శిబిరంపై పెద్ద సంఖ్యలో మంచుపెళ్లలు విరిగిపడటంతో శిబిరం మొత్తం కూరుకుపోయింది.
ఈ శిబిరంలో జెసిఓ సహా తొమ్మిదిమంది జవాన్లు ఉన్నారు. వీరంతా మద్రాస్ బెటాలియన్‌కు చెందిన వీరంతా టన్నుల కొద్దీ మంచులో కూరుకుపోయారు. సియాచిన్‌లో ప్రస్తుతం రాత్రిపూట కనిష్టంగా మైనస్ 42 డిగ్రీలు, పగటిపూట మైనస్ 25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని గోస్వామి వెల్లడించారు. సైనిక శిబిరంపై భారీ సంఖ్యలో మంచు బ్లాకులు పడిపోవడంతో వీరి ఆచూకీ కనుగొనడం కష్టసాధ్యంగా మారుతోందన్నారు. మంచు బ్లాకులను కోసే సామగ్రిని సైతం సైనిక సిబ్బంది తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు.

జోక్యం చేసుకోం
ఢిల్లీ మున్సిపల్ సమ్మెపై సుప్రీం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ఢిల్లీ మున్సిపల్ ఉద్యోగుల సమ్మె వ్యవహారంలో జోక్యం చేసుకోడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ అంశం హైకోర్టులో ఉన్నందున తాము జోక్యం చేసుకోబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘్ఢల్లీ హైకోర్టు కార్యకలాపాల్లో మేం కలగచేసుకోం. సమ్మెపై మేం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. హైకోర్టుకు వాదనలు వినిపించుకోవాలని పిటిషర్ రాహుల్ బిర్లాకు కోర్టు సూచించింది. మున్సిపల్ సమ్మె వల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, దీనిపై తాము హైకోర్టును ఆశ్రయిస్తే విచారించకుండా వాయిదా వేసిందని పిటిషనర్ వాపోయారు. కేసును ఈ నెల 10న విచారిస్తామని హైకోర్టు తెలిపినట్టు ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ మున్సిపల్ ఉద్యోగుల సమ్మెపై బిర్లా పిల్ దాఖలు చేశారు. 2003 నుంచి అరియర్స్ చెల్లించడం లేదని ఆయన ఆరోపించారు. సమ్మె వల్ల శానిటరీ ఉద్యోగులు వీధుల్లోని చెత్తను తొలగించడం లేదని, దీంతో ప్రజారోగ్యం పాడవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 2న పిల్ విచారణ సందర్భంగా ఉద్యోగులకు జనవరి జీతాలు ఇవ్వడానికే తమ వద్ద డబ్బులు లేవని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసిడి) హైకోర్టుకు వివరణ ఇచ్చింది.