జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో తొలగని అనిశ్చితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఫిబ్రవరి 4: జమ్మూకాశ్మీర్‌లో రాజకీయ అనిశ్చితికి ఇప్పట్లో తెరపడే అవకాశాలు కనిపించకపోవడంతో రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రా గురువారం ఇద్దరు పదవీవిరమణ పొందిన ఐఎఎస్ అధికారులను తన సలహాదారులుగా నియమించుకున్నారు. రాష్ట్ర పాలనా వ్యవహారాలను నడపడంలో వీరిద్దరు గవర్నర్‌కు సహకరిస్తారు. జమ్మూకాశ్మీర్ కేడర్‌కు చెందిన ఇద్దరు రిటైర్డ్ ఐఎఎస్ అధికారులను సలహాదారులుగా నియమిస్తూ గవర్నర్ గురువారం ఆదేశాలు జారీ చేశారని ఒక అధికార ప్రతినిధి వెల్లడించారు. 1977 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి దేవాన్, జమ్మూకాశ్మీర్‌లో, కేంద్రంలో వివిధ స్థాయిల్లో పనిచేసిన గనయి అనే ఇద్దరిని గవర్నర్ తన సలహాదారులుగా నియమించుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంపై చర్చించడానికి గవర్నర్ వోహ్రా ఈ నెల 2న పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సత్‌పాల్ శర్మలను సమావేశానికి ఆహ్వానించారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఈ రెండు పార్టీల వైఖరిని గవర్నర్ ఈ భేటీలో అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ ఇద్దరు నేతలు కూడా ప్రభుత్వ ఏర్పాటులో జరుగుతున్న జాప్యానికి బాధ్యతను ఒకరిపై మరొకరు తోసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సరుూద్ రాజకీయ వారసురాలిగా మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడవలసి ఉంది. అయితే ఆమె ప్రభుత్వ ఏర్పాటుకోసం కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి కొన్ని షరతులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు ఏకాభిప్రాయానికి రాలేకపోవడం వల్ల ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. ముఫ్తీ మహమ్మద్ సరుూద్ జనవరి 7న మృతి చెందడంతో మరుసటి రోజు రాష్ట్రంలో రాష్టప్రతి పాలన అమలులోకి వచ్చింది.
గవర్నర్ సలహాదారుగా నియమితులయిన దేవాన్ కేంద్ర పర్యాటక కార్యదర్శిగా పనిచేసిన తరువాత 2014 అక్టోబర్ 20న స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. చేయి తిరిగిన రచయిత అయిన దేవాన్ సాహిత్యంపై దృష్టి కేంద్రీకరించేందుకు ముందే స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 1982 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి గనయి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి తన పేరును పరిశీలించకపోవడంతో గత సంవత్సరమే స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో
సుప్రీంకు సోనియా, రాహుల్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కింది కోర్టు జారీ చేసిన సమన్లను హైకోర్టు సమర్ధించడాన్ని వారు సవాల్ చేశారు. సోనియా, రాహుల్, సుమన్ దూబే, శామ్‌పిట్రోడా హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2015 డిసెంబర్ 7న వీరిపై కింది కోర్టు జారీ చేసిన సమన్లను హైకోర్టు సమర్థించింది. అయితే డిసెంబర్ 19న కాంగ్రెస్ నేతలకు పాటియాలా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన ఆస్తుల్లో అవకతవకలకు పాల్పడ్డారని బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి కాంగ్రెస్ నేతలపై పిటిషన్ దాఖలు చేశారు. మెజిస్ట్రేట్ కోర్టులో ఫిబ్రవరి 20న ఈ కేసు విచారణకు రానుంది. తొలుత కింది కోర్టు జారీచేసిన సమన్లను రద్దు చేయడానికి హైకోర్టు నిరాకరించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పార్టీ సీనియర్ నేతలు సుమన్ దూబే, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, శామ్‌పిట్రోడా, ద యంగ్ ఇండియా లిమిటెడ్‌పై సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. నిందితులందరిపై ఐపిసిలోని సెక్షన్ 403, 406, 120బి కింద కేసులు నమోదయ్యాయి. 2014 జూన్ 6న కాంగ్రెస్ నాయకులందరికీ ట్రయల్ కోర్టు సమన్లు జారీ చేసింది. అదే ఏడాది ఆగస్టు 7న వాయిదాకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అయితే ముందు రోజు ఆగస్టు 6న హైకోర్టు స్టే మంజూరు చేసింది. డిసెంబర్ 7న స్టేను ఎత్తివేసిన హైకోర్టు సమన్ల రద్దుకు నిరాకరించింది.

నేడు లంకకు సుష్మ
రెండు రోజుల పర్యటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం కొలంబో వెళుతున్నారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాల్లో ఇరు దేశాలకు మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషిచేయనున్నారు. కొలంబోలో శుక్రవారం జరగబోయే తొమ్మిదవ ఇండో-శ్రీలంక జాయింట్ కమిషన్ సమావేశంలో భారత్-శ్రీలంక విదేశాంగ మంత్రులు సుష్మా స్వరాజ్, మంగాలా సమరవీర హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్చించనున్నారు. ఆర్థిక, వాణిజ్యంతో పాటు సామాజిక, సాంస్కృతిక, విద్య తదితర రంగాల్లో పరస్పర సహకారంతోపాటు ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూలంకషంగా చర్చించనున్నారు. జాయింట్ కమిషన్ సమావేశం ఇంతకుముందు 2013 జనవరిలో ఢిల్లీలో జరిగింది. ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకునేందుకు 1992లో జాయింట్ కమిషన్‌ను ఏర్పాటుచేశారు. శ్రీలంకలో రెండు రోజుల పాటు పర్యటించనున్న సుష్మ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాని రనిల్ విక్రమ్‌సింఘె, ఇతర ఉన్నతస్థాయి నాయకులతో సమావేశం కానున్నారు.
ఈ చర్చల్లో మత్స్యకారుల అంశం కూడా చోటుచేసుకునే అవకాశం ఉంది. గత కొనే్నళ్లుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు తిరోగమన దిశలో కొనసాగుతున్న నేపథ్యంలో సుష్మ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.