జాతీయ వార్తలు

అశోక్ చవాన్‌కు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 4: ఆదర్శ్ కుంభకోణం కేసులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ను విచారించడానికి గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు సిబిఐకి అనుమతి ఇచ్చారు. చవాన్‌ను ప్రశ్నించే అంశంపై బిజెపి నాయత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు సిఫార్సు చేసింది. ‘మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు గురువారం మాజీ సిఎం అశోక్ చవాన్‌ను విచారించడానికి సిబిఐకి అనుమతి ఇచ్చారు’ అని ఓ అధికార ప్రకటనలో తెలిపారు. ఐపిసిలోని సెక్షన్ 120-బి (కుట్ర), 420 (చీటింగ్)ల సెక్షన్ల కింద కాంగ్రెస్ సీనియర్ నేతపై కేసు నమోదైంది. ఆదర్శ్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీలో జరిగిన కుంభకోణం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. 2015 అక్టోబర్ 8న ముంబయి సిబిఐ జాయింట్ డైరెక్టర్ సెక్షన్ 197 కింద మాజీ సిఎం అశోక్ చవాన్‌ను విచారించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. బాంబే హైకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన జస్టిస్ పాటిల్ కమిషన్ నివేదిక ఆధారంగా జెడి విజ్ఞప్తి చేశారు. దీనిపై గవర్నర్ విద్యాసాగర్‌రావు మంత్రిమండలి అభిప్రాయాన్ని కోరారు. ఆదర్శ్ హౌసింగ్ స్కామ్ నేపథ్యంలో 2010లో అశోక్ చవాన్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఆయన నాందేడ్ లోక్‌సభ సభ్యుడిగా, మహారాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆదర్శ్ కేసులో చవాన్‌తోపాటు 12 మందిపై సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది. 2013లో అప్పటి గవర్నర్ శంకరనారాయణన్ కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్‌ను విచారించడానికి అనుమతి ఇవ్వలేదు. ఇటీవల మహారాష్టల్రోని బిజెపి ప్రభుత్వం గవర్నర్‌కు సిఫార్సు చేయడంతో అశోక్ చవాన్ సిబిఐ ముందుకెళ్లక తప్పలేదు. కాగా బిజెపి ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని చవాన్ ఆరోపించారు.