జాతీయ వార్తలు

ఎన్నికలకు సిద్ధమవండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి, ఫిబ్రవరి 4: కేరళలో రాజకీయ వాతావరణం బిజెపి అధికారంలోకి రావడానికి అనుకూలంగా ఉందని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేలా చూడడానికి మైనారిటీలుసహా అన్ని వర్గాల ప్రజలను పార్టీవైపు మొగ్గేలా చేయడానికి అదనపు కృషి చేయాలని పార్టీ కార్యకర్తలను కోరారు. కొచ్చికి సమీపంలోని అలువ వద్ద గురువారం జరిగిన కేరళ బిజెపి కోర్ కమిటీ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మనం రాజశేఖరన్ ఇటీవల చేపట్టిన విమోచన యాత్రకు ప్రజలనుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సాధించిన మంచి ఫలితాలు, రాజశేఖరన్ యాత్రకు లభించిన సానుకూల స్పందనను షా ప్రస్తావిస్తూ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ వాతావరణం బిజెపికి చాలా అనుకూలంగా ఉందని అన్నారు. కేరళలో బిజెపి ఇప్పటివరకు లోక్‌సభ ఎన్నికల్లో కాని, అసెంబ్లీ ఎన్నికల్లో కాని కనీసం ఖాతా కూడా తెరవలేక పోయిన విషయం తెలిసిందే. పార్టీ కార్యకర్తలు ఈ పరిస్థితిని పూర్తిగా సద్వినియోగం చేసుకుని మైనారిటీలు సహా అన్ని వర్గాలకు చేరువ కావాలని షా కోరారని ఆ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని మనం ఇప్పుడు ప్రజల్లో కల్పించాలని, పార్టీని చైతన్యపరచడానికి వార్డు స్థాయిలో ఒక కార్యాచరణను రూపొందించాలని పిలుపునిచ్చారు.
సమావేశం అనంతరం రాజశేఖరన్ మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేయడానికి పార్టీ త్వరలోనే 15 మంది సభ్యులతో ఒక ఎన్నికల కమిటీని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఈ జాబితాలో చాలామంది ప్రముఖుల పేర్లు ఉంటాయని కూడా ఆయన చెప్పారు. మీరు ఎన్నికల బరిలో ఉంటారా అని అడగ్గా, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా తాను దానికి కట్టుబడి ఉంటానని రాజశేఖరన్ చెప్పారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి బిజెపి అధిష్ఠానవర్గం రాజశేఖరన్‌ను ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన విషయం తెలిసిందే. బిజెపి తలుపులు ఎవరికైనా తెరిచే ఉంటాయని ఆయన చెప్తూ, భావసారూప్యం కలిగిన పార్టీలతో పొత్తులకు పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అయితే ఇంతవరకు దీనికి సంబంధించి ఎవరితోను చర్చలు ప్రారంభించలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే త్వరలోనే వెల్లపల్లి నటేశన్ నేతృత్వంలోని శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం (ఎస్‌ఎన్‌డిపి)తో చర్చలు జరుపుతామని తెలిపారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు వ్యవస్థాగత యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడం పార్టీ ముందున్న తక్షణ కర్తవ్యమని రాజశేఖరన్ చెప్పారు.
chitram...
కొచ్చిలో గురువారం జరిగిన కేరళ బిజెపి కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అమిత్ షా