జాతీయ వార్తలు

ముంబయి దాడి పాక్ పనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ, ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో కలిసి భారత ఉప రాష్టప్రతి భవనం, ఇండియా గేట్, భారత గూఢచార సంస్థ కేంద్ర కార్యాలయాలను పేల్చేయాలని అనుకుందని పాక్- అమెరికన్ తీవ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ వెల్లడించినట్టు తెలిసింది. డేవిడ్ హెడ్లీ సోమవారం ముంబయిలోని ప్రత్యేక తీవ్రవాద కోర్టులో టెలికాన్ఫరెన్స్ ద్వారా సాక్ష్యం చెప్పనున్నారు. ముంబయి దాడికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయన కోర్టుకు తెలియజేస్తారు. లష్కరే తోయిబాకు చెందిన పదిమంది ముష్కరులు 2008 నవంబర్ 26న ముంబయిలో ఎనిమిదిచోట్ల బాంబులు పేల్చి, విచ్చిలవిడి కాల్పులతో 150 మందిని పొట్టన పెట్టుకున్న సంఘటన వెనుక పాక్ హస్తం, ఐఎస్‌ఐ ఉందని హెడ్లీ చెప్పారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఆదివారం జరిపిన విచారణలో హెడ్లీ ఈ విషయాలు వెల్లడించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికా జైల్లో 36ఏళ్ల శిక్ష అనుభవిస్తున్న హెడ్లీని ఎన్‌ఐఏ ఎప్పుడు ఎలా విచారించిందనేది వెల్లడికాలేదు. అయితే జాతీయ భద్రత వ్యవహారాల సలహాదారు అజీత్ దోవల్ చేసిన కృషి మూలంగా హెడ్లీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 26/11 కేసును దర్యాప్తు చేస్తున్న కోర్టులో తన వాదన వినిపించనున్నట్టు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నిఖ్కం తెలిపారు. భారత ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టేందుకు అంగీకరించినందుకు బదులుగా హెడ్లీ రేపు కోర్టులో సాక్ష్యం చెప్పనున్నట్టు తెలిసింది. పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ఆమోదం మేరకే లష్కరే తోయిబా 26/11 దాడికి పాల్పడినట్టు ఒప్పుకున్నారు. ఐఎస్‌ఐకు చెందిన మేజర్ ఇక్బాల్, సమీర్ అలీ, లష్కరే తోయిబాకు చెందిన జకీ ఉర్ రెహమాన్ లఖ్వి నాతో పనులు చేయించేవారు. ముంబయిలో ఏ ప్రాంతాల్లో రెక్కీ చేయాలి, ఏ సమాచారం కావాలనేది వారు చెప్పేవారని హెడ్లీ వెల్లడించాడు. ఐఎస్‌ఐకు చెందిన బ్రిగేడియర్ రివాజ్, లష్కరే తోయిబాకు చెందిన జకీ ఉర్ రెహమాన్‌కు పనులు పురమాయించే వారని హెడ్లీ తెలిపారు. 26/11 కోసం హెడ్లీ ముంబయితోపాటు పలు ప్రాంతాల్లో రెక్కీ చేయటం తెలిసిందే. ఐఎస్‌ఐ, లష్కరే తోయిబా ఆదేశం మేరకు తాను ముంబయిలోని తాజ్ హోటల్, ఇతర ప్రాంతాలతోపాటు ఢిల్లీలోని భారత ఉప రాష్టప్రతి నివాసం, ఇండియా గేట్, సిజిఓ కాంప్లెక్స్‌లోని భారత గూఢచార సంస్థ సిబిఐ కేంద్ర కార్యాలయాన్ని రెక్కీ చేసినట్టు హెడ్లీ ఎన్‌ఐఏ విచారణలో వెల్లడించారు. హెడ్లీ రెక్కీ జరిపిన తరువాతే లష్కరే తోయిబాకు చెందిన 10మంది ఇస్లామిక్ తీవ్రవాదులు సముద్రమార్గంలో వచ్చి ముంబయిపై దాడి చేయటం తెలిసిందే.
ముంబయి దాడిని అమెరికా తదితర పాశ్చాత్య దేశాలు గట్టిగా ఖండించిన అనంతరం అరెస్టయిన జకీ ఉర్ రెహమాన్ లఖ్విని ఐఎస్‌ఐ అప్పటి డైరక్టర్ సుఝా పాషా జైలులో కలిశారనేది కూడా హెడ్లీ బయటపెట్టారు. ముంబయి, ఢిల్లీలో తాను రెక్కీ చేసేందుకు ఐఎస్‌ఐ నిధులు సమకూర్చిందనేది కూడా ఆయన అంగీకరించినట్టు సమాచారం. 2008లో ముంబయిపై లష్కరే తోయిబా జరిపిన దాడికి పాక్ ప్రభుత్వం మద్దతు ఉందనేది కూడా ఆయన వెల్లడించారు. 2008 ముంబయి దాడికి కుట్ర చేసినందుకు హెడ్లీ ప్రస్తుతం అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. భారత కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు మొదట నిరాకరించినా, కేంద్ర ప్రభుత్వం అమెరికాపై వత్తిడి తీసుకురావటంతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జోక్యం మూలంగా హెడ్లీ ఈ కేసులో అప్రూవర్‌గా మారినట్టు తెలిసింది.