జాతీయ వార్తలు

విద్వేషమే అసలు చెత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, డిసెంబర్ 1: దేశంలో ప్రబలుతున్న అసహన ధోరణులపై జోరుగా చర్చ జరుగుతున్న సమయంలో ప్రజలు తమ మనసుల్లోని విద్వేష ఆలోచనలను తొలగించుకోవాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం గట్టి సందేశం ఇచ్చారు. వీధుల్లో పోగుపడి ఉన్నది అసలు చెత్త కాదని, మనుషుల మనస్సుల్లో ఉన్న విద్వేష ఆలోచనలే నిజమైన చెత్త అని ఆయన పేర్కొన్నారు. అన్ని రకాల హింసనుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని ఆయన ఉద్బోధించారు. గుజరాత్ పర్యటనలో ఉన్న రాష్టప్రతి వివిధ కార్యక్రమాలలో చేసిన ప్రసంగాలలో మహాత్మా గాంధీ కన్న కలలను నిజం చేయడానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. సమాజంలోని ప్రతి వర్గం సమానత్వంతో జీవించడానికి, సమానంగా అవకాశాలను పొందడానికి వీలుండే సంఘటిత దేశంగా భారత్‌ను నిర్మించడానికి గాంధీజీ చేసిన కృషిని, ఆయన దూరదృష్టిని రాష్టప్రతి ఈ సందర్భంగా వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశుభ్రత కార్యక్రమం గురించి ఆయన ప్రస్తావిస్తూ, బాపూజీ నిర్వచనం ప్రకారం.. స్వచ్ఛ భారత్ అంటే స్వచ్ఛమైన మనస్సు, స్వచ్ఛమైన శరీరం, స్వచ్ఛమైన వాతావరణం అని అన్నారు. ‘్భరత దేశ నిజమైన చెత్త మన వీధుల్లో పోగుపడి లేదు. మన మనస్సుల్లో ఉంది. ఇతరుల అభిప్రాయాలను ప్రకటించనివ్వని మన అయిష్టతలో ఉంది. దీనివల్ల సమాజం వారు, మనంగా, స్వచ్ఛమైన, అపరిశుభ్రమైనదిగా విడిపోయింది’ అని ప్రణబ్ ముఖర్జీ ఇక్కడి సబర్మతి ఆశ్రమంలో ప్రాచీన పత్రాల భాండాగారం, పరిశోధక కేంద్రాన్ని ప్రారంభిస్తూ అన్నారు. ‘ఎంతో మెచ్చుకోదగిన, స్వాగతించాల్సిన స్వచ్ఛ భారత్ మిషన్‌ను విజయవంతం చేసి తీరాల్సిందే. అయితే మన మనస్సులను శుభ్రపరచు కోవడానికి చేయాల్సిన మిక్కిలి కృషికి దీనిని కేవలం ప్రారంభంగానే చూడాలి. అన్ని అంశాలకు సంబంధించి గాంధీజీ కన్న కలలను నిజం చేయడానికి కృషి చేయాలి’ అని అన్నారు.
2012 జూలైలో రాష్టప్రతి పదవి చేపట్టిన తరువాత తొలిసారిగా ఆయన గుజరాత్‌కు వచ్చారు. గుజరాత్ విద్యాపీఠ్ 62వ స్నాతకోత్సవంలో కూడా ఆయన మాట్లాడారు. ‘గాంధీజీ జీవించి ఉన్నప్పుడే కాదు మరణంలోనూ మతసామరస్యం కోసం పాటుపడ్డారు. సమాజంలోని విచ్ఛిన్నకర శక్తుల ఆటలను తిప్పికొట్టి శాంతి సామరస్యాలను కాపాడడంలో శాంతి సామరస్యాల బోధనలే కీలక పాత్ర వహిస్తాయి’ అని రాష్టప్రతి వివరించారు. అసహన ధోరణులు పెరుగుతున్నాయంటూ దేశంలో చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్టప్రతి భారతదేశ ఉదార సంప్రదాయాల గురించి నొక్కి చెప్పారు. అహింస అనేది ప్రతికూల శక్తి కాదని, ప్రజాజీవితం నుంచి అన్ని రకాల హింసను తొలగించాలని ఆయన పిలుపునిచ్చారు.
chitram..
మంగళవారం నిర్వహించిన గుజరాత్ విద్యాపీఠ్ స్నాతకోత్సవంలో రాష్టప్రతి ప్రణబ్