జాతీయ వార్తలు

విచారణకు హాజరుకాని ఆ ముగ్గురు లాయర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పాటియాలా హౌస్ కోర్టులో జర్నలిస్టులు, జెఎన్‌యు విద్యార్థులు, అధ్యాపకులపై జరిగిన దాడి కేసులో సమన్లు జారీ అయిన ముగ్గురు న్యాయవాదుల్లో ఏ ఒక్కరు కూడా గురువారం పోలీసుల ముందు విచారణకు హాజరుకాలేదు. కోర్టు ఆవరణలో ఈ నెల 15న కొంతమంది న్యాయవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి గురువారం మధ్యాహ్నం మూడు గంటలలోగా విచారణకు హాజరు కావలసిందిగా ఢిల్లీ పోలీసులు బుధవారం ముగ్గురు న్యాయవాదులకు సమన్లు జారీ చేశారు. ఈ ముగ్గురు న్యాయవాదుల్లో ఒకరు విక్రమ్ సింగ్ చౌహాన్ కాగా, మరో ఇద్దరు ఎవరనేది పోలీసులు వెల్లడించలేదు. ఆ ముగ్గురు న్యాయవాదులు పోలీసుల ముందు హాజరు కాకుంటే తాము కోర్టును ఆశ్రయించి వారంట్లు పొందుతామని నగర పోలీసు కమిషనర్ బిఎస్ బస్సీ చెప్పారు. పాటియాలా హౌస్ కోర్టు ఆవరణలో సిపిఐ కార్యకర్తను కొడుతూ కెమెరాలో చిక్కిన బిజెపి ఎమ్మెల్యే ఒపి శర్మ గురువారం పోలీసుల ముందు హాజరయ్యారు. కోర్టు ఆవరణలో సోమవారం జర్నలిస్టులు, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థులు, అధ్యాపకులపై దాడికి పాల్పడిన న్యాయవాది విక్రమ్ సింగ్ చౌహాన్ తిరిగి బుధవారం కూడా కోర్టు ఆవరణలో జర్నలిస్టులు, జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ కుమార్‌పై జరిగిన దాడికి నేతృత్వం వహించారు. ఈ దాడి తరువాత ఒక వ్యక్తి కోర్టు బయట మీడియా ముందుకొచ్చి తన పేరు సురేంద్ర త్యాగి అని, దాడి చేసినవారిలో తానూ ఉన్నానని చెప్పాడు. దాన్నో గొప్ప విషయంగా చిత్రీకరించుకున్న ఆయన మీడియాతో ఘర్షణకు దిగాడు. అయితే త్యాగి ఎవరినైనా కొడుతున్నట్లు వీడియో క్లిప్‌ను పోలీసులు కనుక్కోలేకపోయారు. త్యాగి చెప్పిన విషయాన్ని ధ్రువీకరించుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

జెఎన్‌యు వ్యవహారంలో
ఆచితూచి వ్యవహరించండి
సుప్రీం కోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: ఢిల్లీ జెఎన్‌యు విద్యార్థి నాయకుడు కన్హయ్యకుమార్ అరెస్టు నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులతో ఆచితూచి మాట్లాడాలని సుప్రీం కోర్టు గురువారం విజ్ఞప్తి చేసింది. న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ సారథ్యంలోని సుప్రీం కోర్టు బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పాటియాలా హౌస్ కోర్టులో శాంతిభద్రతల పరిస్థితిని గమనిస్తున్నామని వెల్లడించింది. కుమార్ బెయిల్ దరఖాస్తును వ్యతిరేకించకూడదంటూ ఢిల్లీ పోలీసులపై వత్తిడివస్తున్న విషయాన్ని న్యాయవాది ఆర్‌పి లూధ్రా ప్రస్తావించడంతో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఎవరూ కూడా ఈ మొత్తం వ్యవహారంపై ఇష్టారాజ్యంపై ప్రకటను జారీ చేయడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

భారత్ సాక్షులను హాజరుపరచండి

26/11 కేసులో పాక్ కోర్టు ఆదేశం

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 18: ముంబయిపై జరిగిన 26/11 దాడి కేసుకు సంబంధించి 24 మంది భారతీయ సాక్షులను తమ ముందు హాజరుపరచాలని పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక కోర్టు ఆదేశించింది. పాకి స్తాన్ దర్యాప్తు బృందమైన ఎఫ్‌ఐకె ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అత్యంత ప్రాధాన్యతకలిగిన ఈ కేసులో భారతీయ సాక్షులను హాజరుపరిస్తే వారి వాంగ్మూలాన్ని నమోదు చేయవచ్చని వెల్లడించింది. ముంబయి దాడి కేసులో మొత్తం ఏడుగురు నిందితులపై దాఖలైన కేసును ఈ కోర్టు విచారిస్తోంది. అలాగే ఈ దాడి కోసం ఉపయోగించినట్టుగా చెబుతున్న బోట్లను భారత్ నుంచి వెనక్కి రప్పించాలని స్పష్టం చేసింది.
ఈ బోటు పాకిస్తాన్‌కు చేరడం కూడా కేసు విచారణకు అత్యంత కీలకమని దాన్నికూడా పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. ఇందుకు సంబంధించి విదేశాంగ మంత్రిత్వశాఖకు తదుపరి చర్యల కోసం లేఖ రాస్తామని దేశీయ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారి వెల్లడించారు.