జాతీయ వార్తలు

నా ప్రాణాలకు ముపు పంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తిహార్ జైలులో తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశద్రోహం అభియోగాల కింద అరెస్టయి, జుడీషియల్ కస్టడీలో ఉన్న కన్హయ్య కుమార్ తనకు బెయిలు మంజూరు చేయాలని కూడా అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. సుప్రీంకోర్టు ఈ బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం విచారిస్తుంది. పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరచడానికి కన్హయ కుమార్‌ను బుధవారం తీసుకువచ్చిన సందర్భంగా కోర్టు ఆవరణలోనే ఆయనపై కొంతమంది న్యాయవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. కన్హయ్య కుమార్ తరపున న్యాయవాది అనిన్‌దితా పుజారి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. తాను ఎలాంటి దేశద్రోహానికి పాల్పడలేదని కన్హయ కుమార్ ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, అందువల్ల అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకొని తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కన్హయ్య కుమార్ తన పిటిషన్‌లో అభ్యర్థించారు. పోలీసులు తనను కోర్టులో హాజరు పరచడమే కష్టంగా భావిస్తున్నందున తనను జైలులో ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన పేర్కొన్నారు. తనను ఇప్పటికే జుడీషియల్ కస్టడీకి పంపించినందున కస్టడీలోకి తీసుకుకొని ఇంటరాగేట్ చేయాల్సిన అవసరం లేదని ఆయన తన పిటిషన్‌లో వాదించారు. న్యాయమూర్తులు జె.చలమేశ్వర్, ఎఎం సాప్రేతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఆయన బెయిల్ పిటిషన్ ఉంది. ఈ పిటిషన్‌ను గురువారమే విచారించాలని సీనియర్ న్యాయవాదులు సోలి జె సొరాబ్జీ, రాజు రామచంద్రన్ కోరారు. అయితే శుక్రవారం విచారిస్తామని ధర్మాసనం చెప్పడంతో వారు అంగీకరించారు.