జాతీయ వార్తలు

జాతి వ్యతిరేకులను వదిలిపెట్టవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జెఎన్‌యులో జాతి వ్యతిరేక నినాదాలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎబివిపి సభ్యులు బుధవారం ఇక్కడ ర్యాలీ నిర్వహించారు. రామ్‌లీలా మైదాన్ నుంచి జంతర్‌మంతర్ వరకూ జాతీయ జెండాలను చేతబూని పెద్దఎత్తున ప్రదర్శన చేశారు. ఈ ర్యాలీ వల్ల టాల్‌స్టాయ్ రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్లకార్డులు చేతబూనిన ఎబివిపి కార్యకర్తలు ‘్భరత్ మాతాకీ జై’, ‘్భరత్ మాతాకీ అప్‌మాన్, నహీ సహేగా హిందూస్థాన్’, ‘కాశ్మీర్ భారత్‌కా అభిన్ అంగ్ హై’ అంటూ నినాదాలు చేశారు. ‘అగర్ హిందూస్తాన్ మై రెహ్నా హోగా, వందేమాతరం కెహ్నా హోగా (్భరత్‌లో నివసించేవారందరూ వందేమాతం పాడాల్సిందే)’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అలాగే 150 మీటర్ల పొడవైన జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. జెఎన్‌యులో ప్రశాంత వాతావరణాన్ని వామపక్షాలు పాడుచేస్తున్నాయని వారు విమర్శించారు. తరువాత జంతర్ మంతర్ వద్ద జరిగిన సభలో ఎబివిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వినయ్ బిడ్రే మాట్లాడుతూ పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్‌గురు సంస్మరణ సభ నిర్వహించడంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
దేశ భద్రతకు భంగం కలించే శక్తులను ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. జాతి వ్యతిరేకులను ఎబివిపి విడిచిపెట్టబోదని ఆయన ప్రకటించారు. జెఎన్‌యులో లెఫ్ట్ పార్టీల మద్దతుతోనే జాతి వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎబివిపి సీనియర్ నేత సాకేత్ బహుగుణ ఆరోపించారు.
chitram...
జాతి వ్యతిరేక నినాదాలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ
బుధవారం ఢిల్లీలో ర్యాలీ నిర్వహిస్తున్న ఎబివిపి కార్యకర్తలు