జాతీయ వార్తలు

తెలుగు రాష్ట్రాలకు నిధుల విదిలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు కొత్త రైల్వే ప్రాజెక్టుల ఊసే సురేశ్ ప్రభు బడ్జెట్‌లో లేదు. కనీసం నిధుల పరంగానైనా సంతృప్తి కలుగలేదు. విదిలింపు చందంగానే అరకొర కేటాయింపులతో సరి పెట్టారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టణ రైల్వే వ్యవస్థ, ఎంఎంటిఎస్ అభివృద్ధికి తోడ్పడతామని రైల్వే మంత్రి సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని పుణ్య క్షేత్రం తిరుపతి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యాలను పెంచటంతోపాటు ఆ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. లోక్‌సభలో 2016-17 సంవత్సరం రైల్వే బడ్జెట్‌ను ప్రతిపాదిస్తూ ఆయన ఈ విషయాలు తెలిపారు. హైదరాబాదు అర్బన్ రైల్వే వ్యవస్థ, ఎంఎంటిఎస్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వంతో రైల్వే శాఖ ఒప్పందం కుదుర్చుకున్నదని ఆయన తెలిపారు. గేజ్ మార్పిడి, డబ్లింగ్, ఇతర సౌకర్యాలు, వంతెనల నిర్మాణాలు, విద్యుదీకరణ, సిగ్నలింగ్, ఎలక్ట్రికల్ పనులు, శిక్షణ, సిబ్బంది నివాస గృహాల నిర్మాణం తదితర పనులకు మొత్తం 5,023 కోట్లు కేటాయించారు. రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 27 శాతం అధిక నిధులు కేటాయించారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఖరగ్‌పూర్-విజయవాడ మధ్య సరకు రవాణా కారిడార్ నిర్మాణం ముదావహమన్నారు.
నిధుల వివరాలు..

పెద్దపల్లి-కరీంనగర్- నిజామాబాద్ పనులకు 70కోట్లు
నంద్యాల-ఎర్రగుంట్ల లైన్‌కు
50 కోట్లు
మునీరాబాద్-మహబూబ్‌నగర్ లైన్‌కు 90 కోట్లు
మాచెర్ల-నల్గొండ ప్రాజెక్టుకు 20 కోట్లు
కాకినాడ- పిఠాపురం
లైన్‌కు 25 కోట్లు
కోటిపల్లి-నర్సాపూర్ లైన్‌కు
ఎస్.నిధి కింద 150 కోట్లు
ఇబిఆర్ కింద 50 కోట్లు
ఓబులవారిపల్లె-కృష్ణపట్నం
పనులకు 100 కోట్లు
మనోహరాబాద్-కోటపల్లి లైన్‌కు ఎస్.నిధి కింద 20 కోట్లు..
ఇబిఆర్ కింద 10 కోట్లు
విష్ణుపురం-జాన్‌పహాడ్ లైన్‌కు
ఐదు కోట్లు
జగ్గయ్యపేట-మాచెర్ల-జాన్‌పహాడ్ లైన్‌కు 110 కోట్లు
కడప-బెంగళూరు ప్రాజెక్టు
పనులకు 29 కోట్లు
ఇబిఆర్ కింద 29 కోట్లు
భద్రాచలం రోడ్డు-సత్తుపల్లి
లైన్‌కు 25 కోట్లు
నడికుడి-శ్రీకాళహస్తి లైన్‌కు
90 కోట్లు
గూడూరు-దుర్గరాజపురం
పనులకు ఐదు కోట్లు
భద్రాచలం-కొవ్వూరుకు లైన్‌కు ఐదు కోట్లు
అక్కన్నపేట- మెదక్ పనులకు
ఐదు కోట్లు
గుంటూరు-గుంతకల్ పనులకు
87 కోట్లు

విశాఖ జోన్ ఊసే లేదు. . కాజీపేట డివిజన్ మాటే లేదు..