జాతీయ వార్తలు

మార్చి నాటికి సిఎంఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: భద్రతా సంస్థలు ఫోన్ కాల్స్‌ను నేరుగా అడ్డుకునే ఒక కొత్త కేంద్రీకృత పర్యవేక్షక వ్యవస్థ వచ్చే సంవత్సరం మార్చి నాటికి పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ వ్యవస్థ పనిచేయడం ప్రారంభిస్తే సర్వీస్ ప్రొవైడర్ల జోక్యం లేకుండానే భద్రతా సంస్థలు నేరుగా ఫోన్ కాల్‌లను అడ్డుకోవచ్చు. టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ విషయం చెప్పారు. ‘న్యాయబద్ధంగా టెలిఫోన్ సంభాషణలను పర్యవేక్షించడానికి, అడ్డుకోవడానికి కేంద్రీకృత పర్యవేక్షక వ్యవస్థ (సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టం- సిఎంఎస్)ను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అని ఆయన వెల్లడించారు. ‘రూ. 400 కోట్ల ప్రభుత్వ నిధులతో ఈ ప్రాజెక్టును నెలకొల్పడం జరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, పైలట్ ట్రయల్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుంది’ అని మంత్రి వివరించారు. ఈ సిఎంఎస్ వ్యవస్థను ఉపయోగించుకొని భద్రతా సంస్థలు సర్వీస్ ప్రొవైడర్ల జోక్యం లేకుండానే న్యాయబద్ధంగా ఎంపిక చేసిన ఫోన్ నెంబర్లకు సంబంధించిన కాల్స్‌ను అడ్డుకోవచ్చు. ప్రస్తుతం అనుమానిత ఉగ్రవాదులు, నేరస్థుల ఫోన్ సంభాషణలను అడ్డుకోవడానికి సంబంధిత టెలికం ఆపరేటర్లను సంప్రదించాల్సి వస్తోంది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ రూ.400 కోట్ల ప్రభుత్వ నిధులతో ఈ ప్రాజెక్టును నెలకొల్పడానికి ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు.
అయితే పౌరుల గోప్యతను కాపాడడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని, కేంద్ర స్థాయిలో కేబినెట్ కార్యదర్శి, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని సమీక్షా కమిటీలు ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తాయని ఆయన వివరించారు. ఈ యంత్రాంగమే సిఎంఎస్ ప్రాజెక్టు కింద ఫోన్ కాల్స్‌ను అడ్డుకునే ప్రక్రియను పర్యవేక్షిస్తుందని ఆయన తెలిపారు. భద్రతా సంస్థలు లేదా చట్టాన్ని అమలు చేసే సంస్థలు లక్ష్యంగా ఉన్న వ్యక్తులను కాని వారి సంభాషణలను కాని తెలుసుకోలేవని మంత్రి వివరించారు. కేవలం అధీకృత భద్రతా సంస్థలు మాత్రమే తమ దర్యాప్తులో భాగంగా ముందస్తు అనుమతి తీసుకొని ఫోన్ కాల్స్‌ను పర్యవేక్షించడం, అడ్డుకోవడం చేస్తాయని మంత్రి వివరించారు.