జాతీయ వార్తలు

ఎన్టీఆర్ ట్రస్టు శిక్షణ కార్యక్రమాలకు సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఉపాధి కల్పనలో కీలకపాత్ర వహించే నైపుణ్యతను యువతలో పెంపొందించటానికి ఎన్టీఆర్ ట్రస్టు చేపట్టిన శిక్షణ కార్యక్రమాల అమలుకు ఆర్థిక సాయం అందించటానికి కేంద్ర స్కిల్ డెవలప్‌పెంట్ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో సాలీనా మూడువేల మంది యువకులకు స్థానిక అవసరాలకు తగిన శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించటానికి చర్యలు తీసుకుంటారు. ప్రతి నియోజకవర్గానికి మూడుకోట్ల రూపాయలను ప్రాథమికంగా మంజూరు చేయటానికి స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ అంగీకరించారు. ఈ శిక్షణకు సంబంధించిన వివిధ అంశాలపై తెలుగుదేశం ఎంపీలు ట్రస్టు అధికారులతో కలిసి మంత్రి రూడీతో సంప్రదించారు. తమ ట్రస్టు ఇప్పటికే హైదరాబాద్‌లో 1500 మందికి వివిధ విభాగాలలో శిక్షణ ఇచ్చిందని సీఈవో విష్ణువర్థన్ తెలిపారు. తమ ట్రస్టు వృత్తిపరమైన రంగాలలో శిక్షణ ఇచ్చే ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని నైపుణ్యాన్ని మెరుగుపరచటానికి అనుసరించవలసిన విధి విధానాలను రూపొందించిందని ఆయన చెప్పారు. విద్యాపరంగా మంచి అర్హతలు ఉన్నప్పటికీ నైపుణ్యం లేనందున అనేకమందికి ఉపాధి లభించటం లేదని ఆయన చెప్పారు.
ఈ లోపాన్ని సరిదిద్ది నైపుణ్యత పెంపొందించటానికే ఈ కార్యక్రమానికి తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రూపకల్పన చేశారని ఆయన చెప్పారు. ఈ పథకాన్ని విజయవంతంగా అమలుచేయటానికి అవసరమైన ఆర్థిక సాయంతోపాటు సాంకేతికపరమైన సాయాన్ని కేంద్రం అందిస్తుందని తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సి.ఎం. రమేష్ తెలిపారు.
ఎంపీలు రాయపాటి సాంబశివరావు, జె.సి. దివాకర్ రెడ్డి, గల్లా జయదేవ్, కింజారపు రామ్‌మోహన్ నాయుడు, అవంతి శ్రీనివాస్, మురళీమోహన్‌తోపాటు ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు మంత్రి రూడీని కలసిన బృందంలో ఉన్నారు.