జాతీయ వార్తలు

పర్సు జిప్‌లో ఇరుక్కున్న శాలువా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శాలువా ఆమె పర్సు జిప్‌లో ఇరుక్కుపోవడంతో దాన్ని తీయడానికి ఆమె ఇబ్బంది పడాల్సి వచ్చింది. తమ నాయకురాలు ఇబ్బంది పడుతుండడాన్ని చూసిన మల్లికార్జున ఖర్గే సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అయితే ఆయన కూడా శాలువాను బైటికి తీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరికి అతికష్టంమీద శాలువాను బైటికి తీయగలిగారు. బైటికి తీసేటప్పుడు శాలువా ఏమయినా చిరిగి పోయిందా అని ఆసాంతం పరిశీలించిన సోనియా అది బాగానే ఉండడం చూసి ఊపిరి పీల్చుకున్నారు.
‘నా ప్రసంగం మీకిష్టం లేదా?’
చర్చ మధ్యలో రాహుల్ గాంధీ లేచి నిష్క్రమణ ద్వారం వైపు వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు సభలో చిన్నపాటి కలకలం చెలరేగింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శిస్తూ ప్రసంగిస్తుండిన బిజెపి సభ్యుడు ప్రహ్లాద్ జోషీ అది చూసి ‘నా ప్రసంగం వినడం మీకు ఇష్టం లేనట్లుంది’ అని వ్యాఖ్యానించారు. అధికార పార్టీకి చెందిన సభ్యులు సైతం జోషీకి మద్దతు పలుకుతూ, రాహుల్‌కు ధైర్యం ఉంటే మా ప్రసంగాల్ని పూర్తిగా వినాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ప్రసంగించిన రాహుల్ గాంధీ ప్రభుత్వంపైనా, మోదీపైనా వాడీ వేడిగా విమర్శలు చేసారు. అయితే తాను వాష్ రూమ్‌కు వెళ్తున్నానని, త్వరలోనే తిరిగి వస్తానని రాహుల్ వాళ్లతో అనడం వినిపించింది. ఆ తర్వాత కొద్ది సేపటికే తిరిగొచ్చిన రాహుల్ గాంధీ జోషీ ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నారు.

చర్యలు తీసుకుంటేనే చర్చలు

‘పఠాన్‌కోట్’పై తేల్చి చెప్పిన భారత్

న్యూఢిల్లీ, మార్చి 2: పాకిస్తాన్‌తో జరిగే చర్చల్లో పఠాన్‌కోట్‌పై దాడికి సూత్రధారులయిన ఉగ్రవాదులపై ఆ దేశం చర్య తీసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తామని భారత్ సంకేతాలు ఇచ్చింది. పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేయడంతో భారత్-పాకిస్తాన్ మధ్య జరగాల్సిన విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ‘ఉగ్రవాద దాడి తరువాత మీరు నన్ను ఉగ్రవాద దాడికి ప్రాధాన్యత ఇస్తారా? దౌత్యపరమైన చర్చలకు ప్రాధాన్యత ఇస్తారా? అని ప్రశ్నిస్తే, జవాబు స్పష్టంగా ఉండాలని నేను భావిస్తాను’ అని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్ అన్నారు.
ఇక్కడ మూడు రోజులపాటు ఆర్థిక వ్యవహారాలు, భౌగోళిక రాజకీయాలపై జరుగుతున్న సదస్సులో (రైసినా సంప్రదింపులు) రెండో రోజయిన బుధవారం ఎస్.జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ పఠాన్‌కోట్ దాడి సూత్రధారులపై చర్యకు భారత్ ప్రాధాన్యమిస్తున్న విషయం చెప్పారు. పఠాన్‌కోట్‌పై దాడికి సంబంధించి భారత్ అందజేసిన సమాచారం ఆధారంగా పాకిస్తాన్ దాడి సూత్రధారులపై తీసుకునే చర్యతో ఇరు దేశాల మధ్య జరగాల్సిన విదేశాంగ శాఖ కార్యదర్శులు స్థాయి చర్చలకు సంబంధం ఉందా? అని ప్రశ్నించగా, పఠాన్‌కోట్ దాడి తరువాత ఇరు దేశాలు పరస్పరం సంప్రదింపులు జరుపుతున్నాయని జైశంకర్ సమాధానమిచ్చారు. తొలుత జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో, ఆ తరువాత తనకు, పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శికి మధ్య సంప్రదింపులు జరిగాయని జైశంకర్ వివరించారు. సమాంతర ప్రక్రియలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి పాకిస్తాన్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ పనేనని గట్టిగా నమ్ముతున్న భారత్ దాడికి సూత్రధారి అయిన జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌పై చర్య తీసుకోవాలని పాకిస్తాన్‌ను డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
స్థూలంగా భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాల గురించి ఆయన మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్‌తో ‘మరింత ఎక్కువ ఆధునిక సంబంధాలు’ ఉండాలని కోరుకుంటోందని జైశంకర్ తెలిపారు. దీనికోసం అనేక అంశాలపై ప్రధానంగా ఉగ్రవాదంపై పాకిస్తాన్ వైఖరిలో మార్పు రావాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
ఆ ఉగ్రవాదుల వివరాలివ్వండి: ఎన్‌ఐఏ
పఠాన్‌కోట్‌పై దాడికి దిగిన నలుగురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదుల వివరాలు ఇవ్వాలని ఈ దాడి కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) పాకిస్తాన్‌ను కోరింది. ఈ మేరకు ఎన్‌ఐఎ పాకిస్తాన్‌కు లాంఛనంగా విజ్ఞప్తి చేస్తూ లేఖ రాసింది. పాకిస్తాన్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ నెల చివరి వారంలో దాడికి గురయిన పఠాన్‌కోట్ వైమానిక స్థావరాన్ని సందర్శించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఎ నలుగురు ఉగ్రవాదుల వివరాలకోసం పాకిస్తాన్‌కు లేఖ రాసింది.