జాతీయ వార్తలు

ఇపిఎఫ్ పన్ను సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోర్ఘాట్: ఇపిఎఫ్ విత్‌డ్రాయల్స్‌పై పన్ను విధింపు ప్రతిపాదనను ఉపసంహరించుకునే దాకా తాను ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించిన ‘ఫెయిర్ అండ్ లలీ పథకం’ ద్వారా దేశాన్ని దోచుకున్న దొంగలు తమ నల్లధనాన్ని తెల్లగా మార్చుకోవడానికి ఈ ప్రధాని అనుమతిస్తున్నారు. అయితే వేతన జీవులు శ్రమించి ఆదా చేసుకున్న సొమ్ముపై మాత్రం పన్ను విధించాలని చూస్తున్నారు’ అని శనివారం ఇక్కడ ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ రాహుల్ అన్నారు. వేతన జీవులు కష్టపడి ఆదా చేసుకున్న సొమ్ముపై పన్ను విధించవద్దని, వారికోసం ఏదయినా మేలు చేయమని నేను మీడియాలోను, ప్రధానమంత్రికి కూడా చెప్పాను. అయితే ప్రధాని పార్లమెంటులో గంటసేపు చేసిన ప్రసంగంలో దీనిగురించి ఒక్క ప్రస్తావన కూడా చేయలేదు’ అని రాహుల్ అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత ఉద్యోగులు తమ ఇపిఎఫ్ ఖాతాలనుంచి ఉపసంహరించుకునే మొత్తంలో అరవై శాతం సొమ్ముకు పన్ను విధించడానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 సాధారణ బడ్జెట్‌లో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనపై వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలతో పాటు ఇతర వర్గాలు సైతం తీవ్రంగా మండిపడుతున్నాయి.
ప్రధాని మోదీపై తన దాడిని తీవ్రం చేసిన రాహుల్ మోదీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చక పోవడం ద్వారా జనాన్ని మోసం చేశారని, ఆయనకు ఓటేసిన వారంతా ఇప్పుడు రీఫండ్ అడుగుతున్నారని అన్నారు. ‘ఈ ప్రభుత్వం నిజాయితీగా పని చేసే కార్మికులు, ఉద్యోగులు, పేద రైతులు, వెనుకబడిన వర్గాలు, యువకులు, దళితులు ఆదివాసీలు, మైనారిటీలకోసం పని చేసే ప్రభుత్వం కాదని, అందుకే తాను ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉంటా’నని రాహుల్ చెప్పారు.
పార్లమెంటులో తాను మోదీని నల్లధనాన్ని వెనక్కి తీసుకు రావడం, ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతాలో 15 లక్షలు జమచేయడంపై ఇచ్చిన హామీపైన, ఇటీవలి బడ్జెట్‌లో ప్రతిపాదించిన నల్లధనాన్ని తెలుపుగా మార్చుకోవడానికి సంబందించిన ప్రతిపాదనపైన, రోహిత్ వేముల ఆత్మహత్య, జెఎన్‌యు ఉదంతంపైన, మేక్ ఇన్ ఇండియా పథకం కారణంగా ఎంతమంది యువకులకు ఉపాధి లభించిందో చెప్పాలంటూ నాలుగు ప్రశ్నలు అడిగానని, అయితే ప్రధాని గంటకు పైగా చేసిన ప్రసంగంలో ఈ ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి సమాధానం చెప్పలేదు సరికదా, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల ప్రసంగాలను ఉటంకించారని, తనపై వ్యక్తిగత దాడి చేశారని చెప్పారు. జెఎన్‌యు ఉదంతాన్ని ప్రశ్నిస్తూ 8 వేల మంది జెఎన్‌యు విద్యార్థుల జీవితాలతో బిజెపి ఆటలాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించబోమని, విద్యార్థులకు తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. శుక్రవారంనుంచి అసోంలో రెండు రోజులుగా పర్యటిస్తున్న రాహుల్ అంతకుముందు నాగావ్‌లోని షహీద్ భవన్‌నుంచి బోర్‌ఘాట్ దాకా ఆరుకిలోమీటర్ల మేర పాదయాత్ర జరిపారు.
chitram..
అసోంలోని నాగావ్‌లో షహీద్ భవన్‌నుంచి బోర్‌ఘాట్ దాకా శనివారం జరిపిన పాదయాత్రలో చిన్నారులతో రాహుల్ గాంధీ.