జాతీయ వార్తలు

రాహుల్ నిర్వాకానికి కాంగ్రెస్ సిగ్గుపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బృందావన్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీరుపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా విమర్శలు గుప్పించారు. జెఎన్‌యులో జాతి వ్యతిరేక నినాదాలు చేసిన వారిని రాహుల్ పరామర్శించినందుకు ఆ పార్టీ సిగ్గుపడాలని ఆయన అన్నారు. భావస్వేచ్ఛ పేరుతో క్యాంపస్‌ను సందర్శించినందుకు కాంగ్రెస్ ప్రశ్నించాలని షా విజ్ఞప్తి చేశారు. బిజెపి యువమోర్చ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ జెఎన్‌యులో జరుగుతున్న జాతి వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం దేనికి సంకేతమని నిలదీశారు. ‘వర్శిటీ క్యాంపస్‌లో జాతి వ్యతిరేక నినాదాలు ఇవ్వడం ద్వారా ఓ అసాధారణమైన వాతావరణ కల్పించారు. భావస్వేచ్ఛ ముసుగులో ఇవన్నీ సాగిస్తున్నారు’ అని బిజెపి అధ్యక్షుడు ఆరోపించారు. జెఎన్‌యుకు వెళ్లి నినాదాలు ఇస్తున్న విద్యార్థులను మద్దతునివ్వడం కాంగ్రెస్ సిగ్గుపడాలని ఆయన విమర్శించారు. ‘జెఎన్‌యులో ఇచ్చిన నినాదాలు భావస్వేచ్ఛ కిందకు వస్తాయా లేక జాతి వ్యతిరేకమా?’ అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన కుమారుడి అభిప్రాయంతో ఏకీభవిస్తారా అంటూ అమిత్‌షా నిలదీశారు. పార్టీ ప్రతిష్టను కాపాడేందుకు యువమోర్చ అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. బిజెపితోనే దేశాభివృద్ధి సాధ్యమన్న అమిత్‌షా ‘పాతికేళ్లు కేంద్రంలో అధికారంలో ఉండేలా కృషి చేయాలి. అప్పుడే భారత్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటుంది’ అని స్పష్టం చేశారు. ఐటి, ఎంబిఏ నిపుణులను తయారుచేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలని షా పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై బిజెపి చీఫ్ చురకలేశారు. ‘ప్రధాని మోదీ కన్నా ఎక్కువ దేశాల్లోనే మన్మోహన్ పర్యటించారు. అయితే దేశానికి ఒరిగిందేంటి?’ అని ఆయన ప్రశ్నించారు. ఏదో రాసుకుని వెళ్లిన రెండు పేజీల ఆంగ్ల ప్రసంగపాఠం చదవడం తప్ప ఏముందని అమిత్‌షా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఐరాససహా అనేక దేశాల్లో హిందీలో ప్రసంగించి దేశా ప్రతిష్ఠను ఇనుమడింపచేశారని ఆయన స్పష్టం చేశారు. మోదీ అధికారంలోకి వచ్చాక యువకులు, రైతులు, పేద వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని బిజెపి అధ్యక్షుడు వెల్లడించారు.