జాతీయ వార్తలు

ప్రైవేటు స్కూళ్లలోనూ జాతీయ గీతం పాడాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడులో అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో జాతీయగీతం కచ్చితంగా ఆలపించాలని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఉదయం అసెంబ్లీ సందర్భంగా జనగణమన గీతం విద్యార్థులతో పాడించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ప్రైవేటు పాఠశాలల్లోనూ జాతీయ గీతాన్ని ఆలపించేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను బెంచ్ విచారించింది. ‘ప్రైవేటు పాఠశాలల్లో తప్పనిసరిగా జాతీయ గీతం పాడాలన్న దానిపై పాఠ్యాంశంలో విధిగా పొందుపరచాలి’ అని న్యాయస్థానం తెలిపింది. ప్రైవేటు పాఠశాలల్లో ఉదయం జరిగే అసెంబ్లీ సందర్భంగా జాతీయగీతం పాడేలా చూడాలంటూ మాజీ సైనికుడు ఎన్ సెల్వతిరుమల్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పౌరులెవరైనా జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

భారత్‌ను నిందించేవాళ్లను సమర్థించాలా?

రోహిత్ ఆదర్శమన్న కన్హయ్యపై మండిపడ్డ వికె సింగ్

బృందావనం, మార్చి 5: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న రిసెర్చ్ దళిత విద్యార్థి రోహిత్ వేముల తనకు ఆదర్శమన్న జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌పై కేంద్ర మంత్రి వికె సింగ్ మండిపడుతూ, రోహిత్ ముంబయి ఉగ్రవాద పేలుళ్లలో ఉరిశిక్ష పడిన యాకుబ్ మెమన్‌కు అనుకూలంగా ఒక సమావేశం ఏర్పాటు చేశాడని ఆరోపించారు. ‘తనకు అఫ్జల్ గురు స్ఫూర్తి కాదని, రోహిత్ వేముల అని జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ చెప్పినట్లు నేను ఈ రోజు పత్రికల్లో చదివాను. అయితే రోహిత్ కూడా యాకుబ్ మెమన్‌కు మద్దతుగా ఒక సమావేశం ఏర్పాటు చేసినట్లు కొందరు నాకు చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే, భారత్‌ను నిందించే ఇలాంటి వాళ్లను మనం సమర్థించాలా?’ అని శనివారం ఇక్కడ బిజెపి యువజన విభాగమైన బిజెవైఎం సదస్సులో మాట్లాడుతూ సింగ్ అన్నారు. హైదరాబాద్ యూనివర్శిటీ రిసెర్చ్ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై తలెత్తిన వివాదాన్ని నీరుగార్చడానికి ఓ వైపు బిజెపి ప్రయత్నిస్తుందడగా మంత్రి సింగ్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత ఆజ్యం పోసేవిగా ఉండడం గమనార్హం.