జాతీయ వార్తలు

ఫొటోలకు లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 18: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం,కేరళ సహా దేశంలోని అనేక రాష్ట్రాల రాజకీయ నాయకత్వానికి ఊరట లభించింది. ప్రభుత్వ ప్రకటనల్లో ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మంత్రుల ఫొటోలను ప్రచురించేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం అనుమతించింది.
గత ఏడాది జారీ చేసిన తీర్పులో ప్రభుత్వ ప్రకటనలు సంబంధించి రాష్టప్రతి, ప్రధాని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫొటోలు మాత్రమే ఉండాలని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు తన తీర్పును సవరించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏడు రాష్ట్రాలు ఆ తీర్పును సవాల్ చేశాయి. ప్రభుత్వ ప్రకటనల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఫొటోలు కూడా ఉంచవచ్చునని న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సారధ్యంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రధాన మంత్రి ఫొటోకు బదులు సంబంధిత మంత్రి లేదా ఇన్‌చార్జి మంత్రి ఫొటోలను కావాలనుకుంటే ప్రచురించుకోవచ్చు అని తెలిపింది. అయితే 2015 మేలో జారీ చేసిన తీర్పులోని ఆదేశాలు అమలులోనే ఉంటాయని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రకటనల్లో ముఖ్యమంత్రులు, గవర్నర్ల ఫొటోలు ఉండకూడదన్న తీర్పు వౌలిక హక్కులకు, సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికే విరుద్ధమంటూ కేంద్రం, ఏడు రాష్ట్రాలు వాదించాయి.