జాతీయ వార్తలు

విభజన హామీలు అమలు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, మార్చి 18: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలోని కోట్లాది మంది బడుగు, బలహీన, దళిత వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా పని చేస్తున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. తన లక్ష్యాన్ని సాధించేంత వరకు మోదీ విశ్రమించరని ఆయన అన్నారు. టిడిపి రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ జన్మదినం సందర్భంగా శుక్రవారం ఇక్కడ ఏర్పాటైన ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఎన్‌డిఏ ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు విభజన చట్టంలో చేసిన హామీలను అమలు చేసి తీరుతుందని ప్రకటించారు. మోదీ చేపట్టిన ముద్రా బ్యాంకు, ఇతర సంక్షేమ పథకాలను ఆయన ప్రస్తావించారు. పదివేల రూపాయల వరకూ పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వాలని ప్రధాని ఆదేశించారని వెంకయ్య చెప్పారు. బిజెపి కుల రాజకీయం చేయదన్నారు. దేవేందర్ రాసిన ‘ఉద్యమబాటలో’ అనే పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవేందర్‌గౌడ్ సేవలను మంత్రి కొనియాడారు. గుర్రానికి కళ్ళెం, బస్సుకు బ్రేకు ఎంత అవసరమో ప్రతిపక్షం కూడా అంతే అవసరమని వెంకయ్య అన్నారు. పార్లమెంటు, అసెంబ్లీలో చొక్కాలు చించుకునే స్థాయికి పడిపోకూడదు, బయటకు రాగానే సంగతి చూస్తాననే విధానం పోవాలన్నారు. ఎన్‌టి రామారావు అధికారంలోకి వచ్చిన తరువాతనే బిసిలకు సముచిత ప్రాధాన్యత లభించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావులా ఒక పార్టీని నమ్ముకుని ముందుకు సాగాలన్నారు. హైదరాబాద్‌ను తెలంగాణకు ఇవ్వాలని వాదించిన వారిలో తాను మొదటివాడిని, దీని వల్ల ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగిందని ఆయన తెలిపారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తాను చిత్తశుద్ధితో కృషి చేస్తానని వెంకయ్యనాయుడు ప్రకటించారు.ఏపికి పదేళ్లు ప్రత్యేక హోదా ఆవ్వాలని తాను వాదించటం కూడా నిజమేనని ఆయన స్పష్టం చేశారు. చాయ్ నుండి ప్రధాన మంత్రి పదవికి ఎదిగిన మోదీ దేశంలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు సూచించారు. తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ చూపించకూడదని విహెచ్ విజ్ఞప్తి చేశారు. బిసి కమిషన్ చైర్మన్ ఈశ్వరయ్య ప్రసంగిస్తూ దేవేందర్ గౌడ్ సేవలను కొనియాడారు.
అసదుద్దీన్ ఒవైసీకి మరిన్ని కష్టాలు
అభిశంసన తీర్మానాన్ని ఆమోదించిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ
బొంబాయి హైకోర్టులో పిల్ దాఖలు
భోపాల్/ముంబయి, మార్చి 18: ‘్భరత్ మాతాకి జై‘ అని అనను గాక అననంటూ వ్యాఖ్యానించిన అఖిల భారత మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్‌కు మరిన్ని చిక్కులు మొదలైనాయి. ఆయనకు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ అసెంబ్లీ శుక్రవారం ఒక అభిశంసన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించగా, మరో వైపు ఆయనపై చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరుతూ బొంబాయి హైకోర్టులో ఒక ప్రజా ప్ర యోజన వ్యాజ్యం (పిల్) దాఖలయిం ది. ప్రస్తుతం జరుగుతున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శుక్రవారం జీరో అవర్‌లో కాంగ్రెస్ సభ్యు డు జితు పట్వారీ ఒవైసీపై అభిశంసన తీర్మానాన్ని తీసుకు రాగా, శాసన స భా వ్యవహారాల శాఖ మంత్రి, బిజెపి నాయకుడు నరోత్తమ్ మిశ్రా గత ఏడాదిన్నరగా ఒవైసీ ఇలాంటి జాతి వ్యతిరేక మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నారని అంటూ అభిశంసన తీర్మానానికి మద్దతు తెలిపారు.. భారతదేశం రా మ్, రహీమ్‌లను సమానంగా ప్రేమించడమే కాకుండా గౌరవిస్తుందని ఆయన అంటూ, విచ్ఛిన్నకర శక్తులకు మద్దతు ఇచ్చే వారిని దుయ్యబట్టారు. పంచాయతీ రాజ్ మంత్రి గోపాల్ భార్గవ కూడా లేచి ఒవైసీని ఖండించడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి ప్రయత్నించారు. అయి తే అధికార, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య గొడవ జరుగుతుందని గ్రహించిన స్పీకర్ సీతాశరణ్ శర్మ కాంగ్రెస్ సభ్యులు పట్వారీ, హర్‌దీప్ సింగ్ దాంగ్ సహా పలువురు సభ్యులు ‘్భరత్-మాతాకి జై’ అంటూ నినాదాలు చేస్తూ ఉండగా అభిశంసన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొం దినట్లు ప్రకటించారు. కాగా, ‘్భరత్ మాతాకి జై’ అని నినదించడానికి నిరాకరించిన ఒవైసీ, మహారాష్టల్రో ఎంఐఎం సభ్యుడు వారిస్ పఠాన్‌లపై న్యాయపరమైన చర్య తీసుకోవాలని పుణెకు చెందిన సామాజిక ఉద్యమ నేత హేమంత్ పాటిల్ దాఖలు చేసిన ‘పిల్’ బొంబా యి హైకోర్టును కోరింది, అంతేకాకుండా మాతృభూమిని అగౌరవపరు స్తూ ఈ ఇద్దరు నాయకులు ఇటీవల చేసిన ప్రసంగాలపై దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని కూడా ఆ పిల్‌లో కోరా రు. ఈ ఇద్దరు నాయకులు చేసిన ప్రసంగాలు మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం, దేశ సమైక్యత, సమగ్రతలను దెబ్బతీయడమే అవుతుందని భరత్ అగైనెస్ట్ కరప్షన్ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడైన పాటిల్ అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగం వౌలిక సూత్రాలకు వ్యతిరేకమంటూ, ఏఐఎంఐఎం పార్టీని నిషేధించాలని ఆయన కోరారు.
అన్నింటా నేనే.. నన్ను చూసి ఓటెయ్యండి
294 స్థానాల్లోనూ నేనే పోటీచేస్తున్నాననుకోండి
ఎన్నికల ప్రచారంలో బెంగాల్ సిఎం మమత పిలుపు
జల్‌పాయ్‌గురి (పశ్చిమ బెంగాల్), మార్చి 18: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఉన్న 294 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెడుతున్నా తనను చూసి మాత్రమే ఓటు వెయ్యాలని ఆమె పిలుపునిచ్చారు. పార్టీ తరపున పోటీచేస్తున్న అభ్యర్థులెవరూ అభ్యర్థులు కారనీ, అన్ని స్థానాల్లో మమతా బెనర్జీనే పోటీచేస్తోందని భావించి ఓటు వేయాలని శుక్రవారం ఉత్తర బెంగాల్‌లో జరిగిన ఎన్నికల సభలో స్పష్టం చేశారు. ఓటు వేసే ముందు తనను మాత్రమే గుర్తుంచుకోవాలని విస్పష్టంగా చెప్పారు. ‘గౌతమ్ దేవ్, విల్సన్ చంప్రామరి, శాంతా చెట్రి... వీరంతా అభ్యర్థులు కారు. మొత్తం 294 స్థానాల్లో నేనొక్కదానే్న అభ్యర్థిని’ అని మమతా బెనర్జీ తేల్చిచెప్పారు. ‘ప్రజలు కోరుకున్నప్పుడల్లా నేను వచ్చాను. వారికి సేవ చేయడం నా బాధ్యత. ఉత్తర బెంగాల్‌కు కనీసం వందసార్లు వచ్చాను’ అని పేర్కొన్నారు. 34 ఏళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన లెఫ్ట్‌ఫ్రంట్‌ను ఆమె దుయ్యబట్టారు. సుదీర్ఘంగా పాలించిన లెఫ్ట్‌ఫ్రంట్ రాష్ట్రానికి చేసిందేమీ లేకపోగా తాకట్టు పెట్టారని ఆరోపించారు. తృణమూల్ అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితి నుంచి అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లగలిగామని మమత వెల్లడించారు. తృణమూల్ ప్రభుత్వం ఏనాడూ వివక్ష చూపలేదని, ఏ పార్టీకి మద్దతునిచ్చేవారైనా ఒకేలా చూశామని మమత చెప్పుకున్నారు. తన హయాంలో ఎనిమిది కోట్ల మంది ప్రజలకు రెండు రూపాయల కిలో బియ్యాన్ని అందించామని వివరించారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపించడంతో ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఓపక్క సోషల్ మీడియాలో కథలు, కథనాలతో హోరెత్తిస్తున్న పార్టీలు, గోడమీద రాతలను కూడా ఉపయోగించుకుని ప్రచారం చేస్తున్నారు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ నేతలు లంచాన్ని స్వీకరిస్తున్నట్లుగా ఓ వీడియో ప్రచారంలోకి రావడంతో అందుకు సంబంధించిన బొమ్మలు గోడలకెక్కాయి. అంటే ఒకప్పటి ప్రచార ప్రక్రియ ప్రజలను ఆకర్షించే రీతిలో మళ్లీ తెరపైకొచ్చిందన్నమాట. ఈ గోడమీద బొమ్మలు, రాతలు ఓటర్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పోటీలో ఉన్న దాదాపు అన్ని పార్టీలు ఈ అతి ప్రాచీన ప్రక్రియను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాయి. ఎంతగా ప్రచారం కొత్త పుంతలు తొక్కినా గోడమీద బొమ్మలకున్న ఆకర్షణ మరి దేనికీ ఉండదని, ప్రతి ఒక్కరూ అనివార్యంగా చూస్తారని చెప్పడానికి వాటికి లభిస్తున్న ప్రచారమే నిదర్శనమని వివిధ పార్టీల నేతలే అంగీకరిస్తున్నారు.