జాతీయ వార్తలు

భావస్వేచ్ఛ అంటే ఇదేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల తొలి రోజు శనివారం పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన ప్రసంగంలో జాతీయ వాదంపై చెలరేగుతున్న వివాదమే ప్రధానాంశంగా నిలిచింది. దేశంపై విమర్శలను తమ పార్టీ సహించబోదని ఆయన స్పష్టం చేస్తూ దేశ వ్యతిరేక నినాదాలు చేయడానికి భావ ప్రకటనా స్వేచ్ఛ ఒక సాకు కారాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై షా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ, ప్రధాని మోదీ ప్రభుత్వం పని చేయకుండా చూడాలన్నదే ఆ పార్టీ ప్రధానోద్దేశమన్నారు. అదే సమయంలో ప్రజలకు అవినీతి రహిత పాలనను, వంశపారంపర్య రహిత నాయకత్వాన్ని, సుస్థిరతను, ప్రజలకు భవిష్యత్తుపై ఆశలను అందించినందుకు ఆయన ప్రభుత్వాన్ని ప్రశంసించారు. భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్, వామపక్షాలపై షా ఎదురుదాడి చేస్తూ మావోయిజం, స్టాలిన్ మద్దతుదారులే దాని గురించి మాట్లాడుతున్నారని వ్యంగ్యంగా అంటూ ఎమర్జెన్సీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగాన్ని గుర్తు చేశారు. షా ప్రసంగం అనంతరం కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు సమావేశం వివరాలను తెలియజేస్తూ అమిత్ షా ప్రభుత్వం చేపట్టిన ప్రజా అనుకూల చర్యలను, ముఖ్యంగా బడ్జెట్ గురించి వివరంగా మాట్లాడారని, దేశ రాజకీయాల స్వరూపానే్న మార్చి వేసేదిగా బడ్జెట్‌ను ఆయన అభివర్ణించారని చెప్పారు. అయితే వివిధ అంశాలపై వివాదాస్పద రాజకీయ చర్చలు జరుగుతుండడం షా ప్రసంగంలో ప్రధానాంశంగా నినిలిచిందని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు)లో దేశ వ్యతిరేక నినాదాలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమర్థించడంపై షా ఆ పార్టీని తీవ్రంగా దుయ్యబట్టారన్నారు. ‘జెఎన్‌యులో దేశాన్ని నాశనం చేయడానికి నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లి, ఈ నినాదాల గురించి ఏమీ మాట్లాడలేదు సరికదా, భావప్రకటనా స్వేచ్ఛ పేరుతూ వాటిని సమర్థించారు’ అని షా అన్నారు.