జాతీయ వార్తలు

అధ్యయనం చేశాకే అనుమతులిచ్చాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి అధ్యయనం చేయకుండానే పర్యావరణ అనుమతులు ఇచ్చారన్నది అవాస్తవమని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. జావడేకర్ బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణానికి సంబంధించిన అటవీ భూములలో నివాస వాణిజ్య సముదాయాలు నిర్మాణం చేసుకునేలా నూతన విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. రాజధానికి సంబంధించి కేంద్రం ఇచ్చిన మినహాయింపు ఇదొక్కటేనని జావడేకర్ చెప్పారు. అమరావతిపై చాలా ప్రతిపాదనలు వచ్చాయని, అందులో కొన్ని వెనక్కి పంపించామని, కొన్నింటిని పరిశీలిస్తున్నామని వివరించారు. రాజధాని నిర్మాణ అనుమతుల విషయంలో జాప్యం ఏమి లేదని, పూర్తి అనుమతులు వస్తాయని స్పష్టం చేశారు. అమరావతికి తక్కువ అటవీ భూములను ఉపయోగించాలని రాష్ట్రానికి విజ్ఞప్తి చేసామని, అడవులను పరిక్షించేలా నూతన రాజధాని డిజైన్ చేయాలని సూచించామని జావడేకర్ తెలిపారు.