జాతీయ వార్తలు

‘కచ్చతీవు’ కరుణ పాపమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 15: తమిళ జాలర్ల విషయంలో డిఎంకె అధినేత కరుణానిధి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. కచ్చతీవుదీవువిషయంలో కోర్టుకు వెళ్లకుండా దాన్ని శ్రీలంకకు అప్పగించిన పాపం కరుణదేనని, ఆ విషయంలో భారత్ ప్రభుత్వానికి ఆయన అన్ని విధాలుగా సహకరించారని జయ ధ్వజమెత్తారు. తరచూ భారత జాలర్లను లంక అరెస్టు చేయడానికి ప్రధానకారణం కచ్చతీవుదీవిని వదులుకోవడమేనని ఆమె అన్నారు. అప్పట్లో కేంద్రం ఓ నిర్ణయం తీసుకున్నప్పుడు కరుణానిధి వౌనం వహించారని దాని ఫలితంగానే ఇప్పుడీ సమస్యలు తలెత్తుతున్నాయని ఆమె విమర్శించారు. అరుపుకొట్టాయ్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన జయలలిత 1974-76 సంవత్సరాల్లో కుదిరిని ఒప్పందాల ద్వారా పాక్ జలసంధిలోని కచ్చతీవుదీవిని శ్రీలంకకు అప్పగించారని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇరుదేశాల మధ్య ఘర్షణలకు ఇది కేంద్ర బిందువైందని అన్నారు. ప్రతిసారి కూడా భారత్ జాలర్లు లంక నౌకాదళం ఆగ్రహానికి గురవుతున్నారని జయ ఆందోళన వ్యక్తం చేశారు. కచ్చతీవువిషయంలో తన వైఫల్యానికి కరుణానిధి సంజాయిషీ ఇచ్చుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

అరుపుకొట్టాయ్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల సభలో
ప్రజలకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి జయలలిత