జాతీయ వార్తలు

నన్ను ఎవరూ ఆపలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రనాఘాట్, ఏప్రిల్ 15: ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పోలీసు అధికారులను బదిలీ చేసినా ప్రస్తుత ఎన్నికల్లో తమ పార్టీ విజయావకాశాలు ఎంత మాత్రం తగ్గవని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్‌కు తన ధిక్కార స్వరాన్ని మరింత పదునుగా వినిపించిన మమత‘నేను ఏమి చేయలనుకుంటే అదే చేస్తాను. ఎలా మాట్లాడలనుకుంటే అలాగే మాట్లాడతాను’అని తీవ్ర స్వరంతో అన్నారు.
ఎవరైనా తనను బెరించేందుకు ప్రయత్నిస్తే అంతే తీవ్రస్థాయిలో స్పందిస్తానని వెల్లడించిన మమత పోలీసు అధికారులను బదిలీ చేసినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని చెప్పారు. నాడియా జిల్లాలో జరిగిన పలు ఎన్నికల సభల్లో శుక్రవారం మాట్లాడిన మమతాబెనర్జీ అకారణంగా అధికారులను బదిలీ చేస్తున్నారని దీని వల్ల మిగతా వారంతా మరింత సంఘటితంగా పనిచేసే అవకాశం ఉంటుందని వెల్లడించారు. కేవలం ప్రతిపక్షాలు చేసిన ఆరోపణల ప్రాతిపదిగానే ఎన్నికల సంఘం స్పందించడం ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. ఫిర్యాదుల పుస్తకాన్ని వెంటనే మూసేసి రాష్ట్రంలో నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడంపై దృష్టిపెట్టాలని ఎన్నికల కమిషన్‌కు ఆమె విజ్ఞప్తి చేశారు. ఈరకమైన అవమానాలు బెంగాల్ ప్రజలు సహించరని పేర్కొన్న మమత ఎన్నికల హింసలో ఇప్పటి వరకూ ఏడుగురు తృణమూల్ కార్యకర్తలు మరణించారని అన్నారు. కేవలం ఫిర్యాదులు చేయడమే పనిగాపెట్టుకున్న కొన్ని వర్గాలు రోజువారీగా ఇసిని కలుస్తున్నాయని ఆరోపించారు. ఈ రకమైన పార్టీలను తిప్పికొట్టాలని, ఎన్నికల తీర్పుద్వారా ఈవిషయాన్ని స్పష్టం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చేనెల 19న ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత తమ కలలు కల్లలేనన్న విషయం విపక్షాలకు స్పష్టమవుతుందని చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే కాకుండా 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ తమ పార్టీదే కీలక పాత్ర అన్ని మమత ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీకి మార్గం చూపేది టిఎంసినే అని పశ్చిమ బెంగాల్ సిఎం ఉద్ఘాటించారు.