జాతీయ వార్తలు

మూడు శాతం వ్యవసాయ సెస్సు విధించాలి: పాల్వాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: సంక్షోభంలో చిక్కుకున్న వ్యవసాయరంగాన్ని ఆదుకుని రైతుల ఆత్మహత్యలను నివారించటానికి బడ్జెట్‌లో 3 శాతం వ్యవసాయ సెస్సును విభించవలసిందిగా కాంగ్రెస్ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వ్యవసాయదారులను ఆదుకోవటానికి వెయ్యికోట్ల రూపాయలతో ఒక కార్పస్ నిధిని ఏర్పాటు చేయవలసిందిగా ఆయన రాజ్యసభలోప్రతిపాదించిన ప్రత్యేక తీర్మానంలో కేంద్రానికి సూచించారు. రైతుల ఆత్మహత్యలు ఆగటం లేదని ఆయన తెలిపారు. వ్యవసాయం లాభసాటిగా లేక పోవటంతో రైతులు సాగుకు స్వస్తిచెబుతున్నారని పాల్వాయి చెప్పారు. వ్యవసాయ భూములు స్థిరాస్తి వ్యాపారానికి బదిలీ అయిపోతున్నాయని ఆయన అన్నారు.