జాతీయ వార్తలు

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: మధ్య ఢిల్లీలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్నిప్రమాదంలో నేచురల్ మ్యూ జియం ఆఫ్ హిస్టరీ పూర్తిగా కాలి బూడిదై పోయింది. తెల్లవారుజామున ఒంటిగంటా నలభై అయిదు నిమిషాల ప్రాంతంలో కన్నాట్‌ప్లేస్ సమీపంలోని మండీ హౌస్ వద్ద ఉన్న అరంతస్థుల ఫిక్కీ కాంప్లెక్స్ భవనం పై అంతస్తులో ఉన్న మ్యూజియంలో తొలుత మంటలు ప్రారంభమైనాయి. ఆవెంటనే మిగతా అవి అంతస్తులకు మంటలు వ్యాపించాయి. తెల్లవారుజామున 5 గంటలకల్లా మంటలను పూర్తిగా అదుపు చేయగలిగారు. అయితే మంటలు పూర్తిగా ఆరిపోలేదని, పై అంతస్తులో మంటలు ఇంకా కనిపిస్తున్నాయని ఓ వార్తాసంస్థ తెలిపింది. కాగా, మంటలను అదుపు చేసే ప్రయత్నంలో అగ్నిమాపక దళానికి చెందిన ఆరుగురు గాయపడగా, వారిని దగ్గర్లోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేర్చారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు రాత్రి పొద్దు పోయాక చెలరేగినందున మరమ్మతుల్లో ఉన్న భవనంలో జనం ఎక్కువ మంది లేరు. భవనం లోపల ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు పని చేయడం లేదని, ఫలితంగానే మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించాయని అగ్నిమాపక అధికారులు చెప్పినట్లు వార్తలు పేర్కొన్నాయి. భవనంలోపల ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు పని చేయడం లేదని, అయినప్పటికీ తాము రెండు గంటల్లోనే మంటలను అదుపు చేయగలిగామని రాజేశ్ పన్వర్ అనే ఫైరాఫీసర్ చెప్పారు. భవనంలోని ఎలక్ట్రిక్ పరికరంలో తొలుత మంటలు ప్రారంభమై ఉండవచ్చని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జెసి మిశ్రా చెప్పారు. ఇదిలా ఉండగా, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ ఫిక్కీ కాంప్లెక్స్‌ను సందర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నేచురల్ హిస్టరీ మ్యూజియం జాతీయ సంపద అని, అది పూర్తిగా బూడిద కావడం విషాదకరమని పరిస్థితిని సమీక్షించిన అనంతరం జవడేకర్ విలేఖరులతో అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 34 మ్యూజియంలలో ఫైర్‌సేఫ్టీ వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయో పరిశీలించాలని ఆదేశించినట్లుమంత్రి చెప్పారు.

చిత్రం... ఢిల్లీలో మంగళవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పూర్తిగా
కాలి బూడిదై పోయిన నేచురల్ హిస్టరీ మ్యూజియం