జాతీయ వార్తలు

కాంగ్రెస్‌పై ఎదురుదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: ఉత్తరాఖండ్ వ్యవహారంలో రాజ్యసభను అడ్డుకుంటున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ దూకుడుకు కళ్లెం వేసేందుకు అధికార బిజెపి పదునైన ఆయుధాలను సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోని యా, ఆ పార్టీ సీనియర్ నేతల్ని లక్ష్యంగా చేసుకుని ఇషత్ జహాన్, అగస్టా కాప్టర్ కుంభకోణాలను తిరగదోడాలని నిర్ణయించింది.వచ్చే వారం లో రాజ్యసభలో అనేక కీలక బిల్లుల్ని ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నందున ఉభయ సభలకూ పార్టీ సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని కూడా విప్ జారీ చేసింది. 3600కోట్ల రూపాయల అగస్టా హెలికాప్టర్ కాంట్రాక్టును సొంతం చేసుకునేందుకు అప్పటి కాంగ్రెస్ నేతలకు ముడుపులు చెల్లించిన వివరాలూ వెల్లడి కావడం బిజెపి నాయకత్వానికి కలిసొచ్చింది. ఓ ఉగ్రవాదిని జాతీయవాదిగా తెరమీదకు తెచ్చేందుకు అప్పటి యుపిఏ సర్కార్ లష్కరే తొయిబా సంస్థకు వంతపాడిదంటూ బలమైన ప్రచారాన్ని బిజెపి చేయబోతోంది. మంగళవారం జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ రెండు అంశాలపైనా విస్తృతంగా చర్చించడంతోపాటు కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టేందుకు ఏ విధంగా ముందుకెళ్లాలన్నదానిపైనా దృష్టిపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
వివిధ అంశాలపై తమ అభిప్రాయాన్ని కాంగ్రెస్‌ను ఎండగట్టడానికి అనుసంరించాల్సిన వ్యూహాలపైనా వారు మాట్లాడారు. ఇషత్ జహాన్ ఓ ఉగ్రవాదని, లష్కరే తొయిబా మిలిటెంట్ అన్న విషయం ప్రపంచమంతా తెలుసని కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే హోమ్ మంత్రి పి చిదంబరం ఆమెకు సహకరించాలని ప్రయత్నించారని, మొత్తం కేసునే తల్లకిందులు చేయడానికి కుట్ర పన్నారని జైట్లీ స్పష్టం చేశారు. ఈ సమావేశం వివరాలను కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మీడియాకు వివరించారు. ఓ ఉగ్రవాదిని జాతీయ వాదిగా తెరపైకి తెచ్చేందుకు అప్పటి ఓ హోమ్ మం త్రి ప్రయత్నించడం దిగ్భ్రాంతిని కలిగిస్తుందని, దాన్ని బట్టి చూస్తే ఆయన లష్కరేతో కలిసి పనిచేశారా అన్న అభిప్రాయం కలుగుతోందని నఖ్వీ పేర్కొన్నారు. అప్పటి గుజరాత్ ము ఖ్యమంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అమిత్‌షాను రాజకీయంగా దెబ్బతీయడానికి నాటి యుపిఏ ప్రభుత్వం ఇషత్ కేసును పావుగా వాడుకుందని ఆయన అన్నారు. అలాంటి హేయమైన దిగ్భ్రాంతికరమైన పరిణామాలను భారత్ జాతి ఎప్పుడూ చవిచూడలేదని తెలిపారు. దీనిపై పార్లమెంటులో పూర్తిస్థాయిలో చర్చజరుగుతుందని అలాగే అగస్టావెస్ట్‌లాండ్ కేసును కూడా చేపట్టి ఎన్నోకొత్త అంశాలను వెలుగులోకి తెస్తామని నఖ్వీ వెల్లడించారు.
ఇప్పటికే వెలుగుచూసిన ఎన్నో అంశాలు కాంగ్రెస్ అవినీతిమయ చరిత్రను ఎండగట్టాయని అన్నారు. ఈకుంభకోణాలు అన్నింటికీ కాంగ్రెస్ జవాబు చెప్పుకోవల్సిందేనని అన్న నఖ్వీ‘పార్లమెంటు ఉభ య సభలకు కచ్చితంగా హాజరుకావాలని బిజెపి ఎంపీలకు విప్ జారీ చేశాం’అన్నారు.

మంగళవారం జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న
ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు