శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రైళ్లలో దొంగలు కనిపిస్తే కాల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 20: రైళ్లలో నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించామని, ఇందులో భాగంగా డెకాయిట్ బృందాలు, గొలుసు దొంగలు కనిపిస్తే కాల్చివేస్తామని హెచ్చరించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆయన నెల్లూరుకు విచ్చేసి రైల్వే డిఎస్పీ, సిఐ, ఎస్సైల కార్యాలయాలను తనిఖీ చేశారు. పలు కేసుల్లో దర్యాప్తు ముందుకు సాగకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నెల్లూరు రైల్వే డిఎస్పీ పరిధిలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో రూ.85.37లక్షల సొత్తును నామమాత్రపు రికవరీతో సరిపెట్టడమేమిటని ప్రశ్నించారు. పెండింగ్ కేసుల్ని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వేసవి సమీపిస్తున్నందున రైళ్లలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రత్యేక గస్తీ నిర్వహించాలని సూచించారు. అనుమానిత వ్యక్తులు, పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్ ముఠాలు దోపిడీలకు పాల్పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రైల్వే పోలీసులు, ఆర్‌పిఎఫ్‌లు సమన్వయంగా పనిచేస్తూ ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు క్షేమంగా చేరేలా చూడాలని సూచించారు. రైల్వేట్రాక్‌లపై మృతి చెందే వారిలో 50 శాతం గుర్తు తెలియనివారేనని, సంఘటన జరిగిన తర్వాత మృతదేహాల చిత్రాలను ప్రసార మాధ్యమాల్లో తెలియచేయాలన్నారు. సిబ్బంది పనితీరును మెరుగుపరుచుకొని బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రైల్వే డిఎస్పీ మోహన్‌రావు, సిఐ జి.దశరథరామారావు, నెల్లూరు, గూడూరు ఎస్సైలు రహీంరెడ్డి, ఎ.బాలకృష్ణ పాల్గొన్నారు.