శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 18: స్వగ్రామంలో రోజూ పని ఉండదు.. దానికితోడు వర్షాలు లేక పంటలు సాగులేదు.. దీంతో చేసేదేమిలేక 50 కిమీ దూరంలో ప్రతిరోజు బేల్దార్ పనికి వెళ్లి వచ్చిన అరకొర సొమ్ముతో కూలీలు కుటుంబాన్ని పోషించుకునేవారి పట్ల విధి చిన్నచూపు చూసింది. శనివారం పని ముగించుకొని వారాంతపు చివరిరోజు కావడంతో వచ్చిన డబ్బులతో ఇంటికి కావాల్సిన వస్తువులను తీసుకొనివెళ్తున్న సమయంలో ఆ కూలీలను ప్రమాదం వెంటాడుతూ వచ్చింది. ఈ సంఘటన శనివారం రాత్రి సూళ్లూరుపేట సమీపం కోటపోలూరు క్రాస్‌రోడ్డు వద్ద హైవేపై జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో చిట్టమూరు మండలం కుమ్మరిపాళెంకు చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల సమాచారం మేరకు చిట్టమూరు మండలం కుమ్మరిపాలెంకు చెందిన 14 మంది బేల్దారి కూలీలు పని ముగించుకొని ఆటోలో సూళ్లూరుపేట నుండి బయలుదేరారు. పట్టణ సమీపంలోని కోటపోలూరు క్రాస్‌రోడ్డు వద్ద పెట్రోల్ బంకులో ఆటోకు డీజిల్ పట్టింకొని వెళుతుండగా ఎదురుగా చెన్నై వైపు వెళ్తున్న ట్రాలీ ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగయ్య (38), వెంకటేష్ (39) చెందారు. ఆటోలో ఉన్న చెంగయ్య, దేవసేనమ్మ, రమణమ్మ, ఇంద్రమ్మ, సులోచనమ్మ, చెంగమ్మ, సకుభాయ్, రాణెమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనం ద్వారా స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. కె నాగమ్మ (40)ను నెల్లూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. వీరిలో రాణెమ్మ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో అందులో ఉన్న కూలీలను రోడ్డు మీద కొంతదూరం లాక్కుని వెళ్లడంతో శరీరంలో భాగాలన్ని చెల్లాచెదరగా రోడ్డుపై పడిపోయాయి.

ఎన్నికల హామీలను ప్రభుత్వాలు నెరవేర్చాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్
గూడూరు, ఫిబ్రవరి 18: ఎన్నికల సమయంలో ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సామాజిక హక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా 175 నియోజకవర్గాలలో పార్టీలకు అతీతంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ శాసనసభ్యుడు కె రామకృష్ణ నేతృత్వంలో సాగుతున్న సామాజిక న్యాయ శంఖారావం ప్రజాచైతన్య బస్సుయాత్ర శనివారం గూడూరులోని టవర్‌క్లాక్ వద్దకు చేరుకుంది. గూడూరు సమీపంలోని 5వ నంబర్ జాతీయ రహదారిలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల సర్కిల్ నుండి సాధుపేట, గాంధీబొమ్మ, సంఘ థియేటర్‌ల మీదుగా టవర్‌క్లాక్ సెంటర్‌కు ఈ బస్సు యాత్ర చేరుకుంది. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ సమస్యలు, ప్రత్యేక హోదా అంశాలపై ఆయన ప్రసంగం సాగింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెబుతున్న పాలకులు ఆ నిధులు క్షేత్రస్థాయిలో ఖర్చు కావడం లేదని, ఈ నిధులు పక్కదారి పడుతున్నాయని, ఇందువల్ల పథకం ప్రయోజనం నెరవేరడం లేదన్నారు. సిఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో బిసిలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఎస్సీ, ఎస్‌టి, బిసి, మైనారిటీల సామాజిక హక్కుల సాధన కోసం ఈ బస్సు యాత్ర ఇచ్చాపురం నుండి బయలు దేరి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. అందరూ ఐకమత్యంతో పోరాటంతో తమ హక్కులను సాధించుకొనవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో రావుల అంకయ్య, సుబ్బారావు, పార్ధసారధి, రామరాజు, పముజుల దశరధరామయ్య, ఉడతా శరత్ యాదవ్, వీరుబోయిన గోపాల్ యాదవ్, కాలేషా, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

మోదీ, బాబు ఇద్దరూ మోసగాళ్లే
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శ
సూళ్లూరుపేట, ఫిబ్రవరి 18: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరూ మోసగాళ్లేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతన్న సామాజిక న్యాయ శంఖారావం శనివారం సూళ్లూరుపేట చేరింది. ఈ సందర్భంగా వారికి స్థానిక హోలిక్రాస్ వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి మోదుగుల పార్థసారధి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ నుండి పురవీధుల్లో ర్యాలీగా వెళ్లి స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్దకు చేరుకొన్నారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విభజన సమయంలో సాక్షాత్తు పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వ నెరవేర్చకుండా కుంటిసాకులు చెబుతోందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో సాక్షాత్తు మోదీ, చంద్రబాబులే ప్రత్యేక హోదా కావాలన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పార్లమెంట్‌లో 10 సంవత్సరాలు పాటు కావాలని అడిగి నేడు అది ముగిసిపోయిన అధ్యాయం, అవసరం లేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. తమ పదవులను కాపాడుకొనేందుకు మోదీని అడిగి నిలదీసే ధైర్యం లేక బాబు, వెంకయ్యలు నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. బిజెపి రాష్ట్రానికి మోసం చేసిందన్నారు. దీనికితోడు అపార అనుభవం ఉన్న చంద్రబాబు కూడా హోదా అవసరం లేదు ప్యాకేజీ చాలని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజించేటప్పుడు అప్పటి ప్రధాని మన రాష్ట్రానికి విశాఖకు రైల్వేజోన్, వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజి నిధులు, లోటు బడ్జెట్, రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తుందని చెప్పారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ, బాబు ఇద్దరూ ఇచ్చిన హామీల సంగతేమిటంటూ ప్రశ్నించారు. ఇలాగే పాలన ఉంటే మోదీ, బాబులపై ఇద్దరూ మోసగాళ్లు అనే పేరుతో ప్రజలే సినిమా తీస్తారని దీనిని గుర్తించుకోవాలన్నారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఢిల్లీలో కొత్త భిక్షగాడని విమర్శించారు. హోదాను జల్లికట్టుతో పోల్చితే విశాఖ బీచ్‌లో కోళ్లపందేలు, పందుల ఆటలు ఆడించుకోండి అంటూ చెప్పడం సిగ్గుచేటన్నారు. ఏ పార్టీ వారు పందుల పందేలు ఆడించలేదని మీ పార్టీకి చెందిన జెసి ప్రభాకర్‌రెడ్డి మాత్రమే ఇలాంటి పందేలు ఆడించాడని ఇది మీకు తెలియదా అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే హోదా ఇవ్వాల్సిందేదనని దీనిపై పోరాటం ఆగదన్నారు. రాష్ట్రంలో అట్టడుగు వారికి న్యాయం జరిగి రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత దళిత, మైనార్టీలపై దాడులు పెరిగాయన్నారు. ఎక్కడ చూసినా సంఘ్‌పరివార శక్తులను కేంద్ర ప్రభుత్వం పెంచి పోషిస్తోందన్నారు. వీటన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో సిసిఐ జిల్లా కార్యదర్శి మోదుగుల పార్థసారధి, స్థానిక నాయకులు రమణయ్య, ఆనందబాబు, వజ్రమణి తదితరులు పాల్గొన్నారు.

ప్రజల వద్దకే పాస్‌పోర్టు సేవలు
రీజనల్ పాస్‌పోర్టు అధికారి డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి వెల్లడి
ముత్తుకూరు, ఫిబ్రవరి 18: పాస్‌పోర్టు సేవలు అందించడంలో ప్రపంచంలో అమెరికా, చైనా తరువాత భారతదేశం మూడో స్థానంలో ఉందని రీజనల్ పాస్‌పోర్టు అధికారి డాక్టర్ ఇ విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. శనివారం కృష్ణపట్నం పోర్టులో ఏర్పాటు చేసిన పాస్‌పోర్టు సేవా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశం పాస్‌పోర్టు పంపిణీలో ప్రపంచంలో మూడో స్థానంలో ఉందన్నారు. గతంలో పాస్‌పోర్టు సేవలు పొందాలంటే సుమారు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు సమయంతోపాటు, కష్టతరంగా ఉండేదని అన్నారు. నేడు విదేశీ వ్యవహారాల శాఖ అనేక సంస్కరణల అమలుతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజల వద్దకే పాస్‌పోర్టు సేవలు అందిస్తోందన్నారు. ఈనేపథ్యంలో త్వరితగతిన పాస్‌పోర్టును సులభంగా పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తపాలా విభాగం ద్వారా ప్రతి జిల్లాలో పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే 56 జిల్లాల్లో సేవా కేంద్రాలు ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కడప, నెల్లూరు జిల్లాల్లో కూడా త్వరలో తపాలా కార్యాలయాల్లో పాస్‌పోర్టు సేవలు ప్రారంభిస్తామన్నారు. రాబోయే ఐదేళ్లల్లో పాస్‌పోర్టు పంపిణీల్లో అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయని ఆయన అన్నారు. ఇ-గవర్నస్ ద్వారా సంవత్సరానికి కోటి పాస్‌పోర్టులు పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కృష్ణపట్నం పోర్టు ఆధ్వర్యంలో పాస్‌పోర్టు మేళా నిర్వహించడం హర్షణీయమని అన్నారు. పాస్‌పోర్టు మంజూరుకు అవసరమైన వెరిఫికేషన్‌లో పోలీసులు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని కొనియాడారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ మేళాలో సుమారు ఆరు వందల మందికి పాస్‌పోర్టులు మంజూరు చేయనున్నట్లు రీజనల్ పాస్‌పార్టు అధికారి డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.
ఇమిగ్రేషన్ కార్యాలయం ప్రారంభం
కృష్ణపట్నం పోర్టులో ఇమిగ్రేషన్ కార్యాలయాన్ని జిల్లా ఎస్‌పి విశాల్ గున్నీ ప్రారంభించారు. పాస్‌పోర్టు మేళాలో పాల్గొన్న ఆయన పాస్‌పోర్టుల వెరిఫికేషన్‌లో పోలీసు యంత్రాంగం సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. త్వరితగతిన పాస్‌పోర్టు పొందేందుకు నిర్వహించిన ఈ మేళా ఎంతో ప్రయోజకరమని అన్నారు. అనేక మంది విద్యార్థులకు సులభతరంగా పాస్‌పోర్టులు అందించేందుకు ఈ పాస్‌పోర్టు మేళా నిర్వహించిన ఓడరేవు యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఇఓ సుబ్బారావు, పిఆర్ హెడ్ వేణుగోపాల్, సిఇఓ చక్రవర్తి, సెక్యురిటీ సీనియర్ జిఎం రాజేంద్రప్రసాద్, మీడియా ప్రతినిధి వి శీనయ్య తదితరులు పాల్గొన్నారు.