శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఆత్మగౌరవానికి అవినీతి మరక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, డిసెంబర్ 11: పథకం పేరేదైనా, ఎవరి సంక్షేమం కోసం ఉద్దేశింపబడినదైనా తొలి ఫలితం మాత్రం స్వార్ధపరులకు, అవినీతిపరులకు అనే విషయం మరోసారి ప్రస్ఫుటమైంది. ఇలా అనర్హులకు, వారికి సహకరించే అధికారుల తోడ్పాటుతో అవినీతి మరకలు అంటే ప్రభుత్వ పథకాల కోవలోకి మహిళల ఆత్మగౌరవం పేరుతో వచ్చిన మరుగుదొడ్ల నిర్మాణ పథకం కూడా చేరిపోయింది. చేసిన తప్పుకు చేతనైనంత మేర సరిదిద్దుకునే పనిలో పడింది జిల్లా అధికార యంత్రాంగం. ఈ పథకం అమలులో రూ.వంద కోట్ల మేర అవినీతి జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. జిల్లాను ఓడిఎఫ్ (బహిరంగ మలవిసర్జన రహిత) జిల్లాగా ప్రకటించే ఆతృతలో జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయి సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు కోరిన విధంగా నిధుల విడుదల చేయడంతో అవినీతి వెల్లువలా పారింది. సుమారు జిల్లావ్యాప్తంగా 2.70 లక్షల మరుగుదొడ్లు నిర్మించి ప్రజలను బహిరంగ మలవిసర్జనకు దూరంగా ఉంచే ప్రయత్నం చేశారు. ఇందుకోసం రూ.350కోట్ల వరకూ నిధులు ఖర్చుపెట్టారు. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.15వేలు ఖర్చు పెట్టారు. కొన్నిచోట్ల లబ్ధిదారులు తామే సొంతంగా నిర్మించుకుంటామని ముందుకు వచ్చి ప్రభుత్వ సహాయానికి తమ వంతుగా మరికొంత జమచేసుకొని నిర్మించుకోవడం జరిగింది. ఇలా ముందుకు వచ్చిన వారికి ప్రభుత్వ నిర్దేశించిన మేరకు కాకుండా రూ.2 నుండి 3 వేల వరకూ కోత విధించి క్షేత్రస్థాయి అధికారులు అందచేశారనే ఆరోపణలున్నాయి. ఇక ముందుకురాలేక పోయిన నిరక్ష్యరాస్యులు, గిరిజనులు, ఇతర బడుగు బలహీన వర్గాల వారికి క్షేత్రస్థాయి, ఒప్పంద ఉద్యోగులు, స్థానిక ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లుగా మారి నిర్మించారు. ఇవి ప్రస్తుతం ఎందుకూ పనికిరాకుండా పోయాయి. నాసిరకం నిర్మాణాలు కావడంతో వీటిని లబ్ధిదారులు ఉపయోగించడం లేదు. ఇటీవల తిరుపతి ఎంపి వరప్రసాద్‌రావు గ్రామాల్లో పర్యటించిన సమయంలో ఎక్కడా కూడా మరుగుదొడ్లను ఉపయోగిస్తున్నట్లు కనిపించలేదని పేర్కొనడం గమనార్హం. మరోవైపు జిల్లాలోని 96 గ్రామ పంచాయతీల పరిధిలో వంద కోట్ల మేర అవినీతి జరిగిందనే ప్రాథమిక సమాచారంతో జిల్లా అధికార యంత్రాంగం ఒక్కసారిగా కంగుతింది. పాత మరుగుదొడ్లకు కొత్తగా బిల్లులు మంజూరు చేసిన అధికారుల తీరు కొన్ని ప్రాంతాల్లో వెలుగుచూసింది. దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టిన అధికారులు ఇప్పటికే గూడూరు ఎంపీడీవోపై చర్యలు తీసుకోగా, మరికొందరు ఎంపీడీవోలు, ఈవోపిఆర్‌డీలతో పాటు ఒప్పంద ఉద్యోగులపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. శిక్షణలో ఉన్న జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు తిరిగి వచ్చిన వెంటనే వీరిపై చర్యలు ఉండే అవకాశముందని తెలిసింది. మరోవైపు ఈ అవినీతి మరకను తొలగించుకోవడంతో పాటు మరుగుదొడ్లను ఎలాగైనా వినియోగంలోకి తీసుకువచ్చేందుకు 41రోజుల ఆత్మగౌరవ దీక్ష పేరుతో అధికారులు పల్లెల్లో పర్యటిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద మెప్పు పొందే ప్రయత్నంలో అధికారులు చేసిన పొరపాటు స్వార్థపరుల జేబుల్లోకి కోట్లను చేర్చింది. క్షేత్రస్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారపార్టీ నేతలు ఎవరికి అందినంత మేర దోచుకున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ఉన్నత ఆశయంతో తీసుకువచ్చిన ఈ పథకానికి అవినీతిమయం అయ్యేందుకు ఎంతో కాలం పట్టలేదు. తిరిగి ఆత్మగౌరవ దీక్ష పేరుతో సాగిస్తున్న కార్యక్రమంలో ఎటువంటి అప్రతిష్ట రాకుండా అధికారులు ముందుగానే తగు జాగ్రత్తలతో కార్యాచరణలోకి దిగినట్లు తెలుస్తోంది.