శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నిరవధిక నిరాహార దీక్షలో తపాలా ఉద్యోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, మే 22: గ్రామీణ తపాలా ఉద్యోగుల వేతన కమిటీ రిపోర్టు అమలులో జరుగుతున్న తీవ్రజాప్యాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా గ్రామీణ తపాలా ఉద్యోగులు మంగళవారం నుండి చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట తపాలా ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తపాలా ఉద్యోగులను ఉద్ధేశించి ప్రధాన తపాలా పోస్టుమాస్టర్ ఎన్.రవికుమార్ మాట్లాడుతూ తపాలా శాఖకు జీడీఎస్ వేతన కమిటీ రిపోర్టు సమర్పించి సుమారు 16నెలలు గడుస్తున్నా, తపాలాశాఖ, కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఇప్పటికీ సిఫారసులు అమలుకు నోచుకోవటం లేదని అన్నారు. దీనివల్ల గ్రామీణ తపాలా ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారన్నారు. ఎన్ని ఆందోళన కార్యక్రమాలు చేసినా తపాలాశాఖ, కేంద్రప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేక తపాలాశాఖలోని అన్ని కార్మిక సంఘాలు కలసి సంయుక్త కార్యాచరణ సమితిగా ఏర్పడి ఈనెల మూడవ తేదీన తపాలా శాఖ కార్యదర్శికి నిరవధిక సమ్మె నోటీసు ఇచ్చారన్నారు. అందులో భాగంగా మంగళవారం నుంచి నిరవదిక సమ్మెనుప్రారంభించామన్నారు. జడీఎస్ వేతన కమిటీ రిపోర్టులోని సానుకూల అంశాలను వెంటనే అమలు జరిపేంత వరకు, జీడీఎస్‌ల న్యాయమైన డిమాండ్ నెరవేర్చేవరకు సమ్మె కొనసాగుతుందని చెప్పారు. డివిజన్‌లోని తపాలా ఉద్యోగుల సమస్యలపై పోరాడటానికి సంయుక్త కార్యాచరణ సమితి భవిష్యత్తులో కూడా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐజీడీఎస్‌యు, ఎన్‌వీజీడీఎస్, ఎఫ్‌ఎన్‌పీవో, ఏఐపీఎస్‌సీఎస్‌టీఇఎఫ్‌ఏ కార్యదర్శులు హరీష్, హుస్సేన్‌బాబు, దశరథయ్య, రమణయ్య, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.