శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రూపాయి అవినీతిని కూడా సహించను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదలకూరు, జూలై 6: సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక్క రూపాయి అవినీతి జరిగినా సహించేది లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేసారు. మండలంలోని విరువూరు సమీపంలోని కనుపూరు కాలువను శుక్రవారం రాత్రి ఆయన పరిశీలించారు. కాలువ పనుల వివరాలను ఆయన సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇరిగేషన్ పనుల్లో కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందని, అవినీతికి పాల్పడిన వారు ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదన్నారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రైతుల పేరిట దోచుకుతింటున్నారని విమర్శించారు. అవినీతికి పాల్పడిన అధికారులను సోమిరెడ్డి ప్రోత్సహించటం విడ్డూరమని, టీడీపీ నేతలు అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. తన కుటుంబం గురించి మాట్లాడే స్థాయి సోమిరెడ్డికి లేదన్నారు. అభివృద్ధికి సహకరిస్తానని, అవినీతిని ఎండగడుతానన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా నాయకులు వి గోపాల్‌రెడ్డి, బుజ్జిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీజేఎఫ్‌ఎస్ పట్టాలపై లబ్ధిదారులకు అవగాహన
వెంకటగిరి, జూలై 6 : గతంలో రైతులకు సీజేఎఫ్‌ఎస్ పట్టాలు మంజూరైన లబ్ధిదారులకు శనివారం పట్టణంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గూడూరు ఆర్డీవో అరుణ్‌బాబు అవగాహన కల్పించారు. సీజేఎఫ్‌ఎస్ రైతులకు ప్రభుత్వం అసైన్‌మెంట్ పట్టాలు మంజూరు చేస్తుందని తెలిపారు. సీజేఎఫ్‌ఎస్ పట్టాల వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండందని సూచించారు. అసైన్‌మెంట్ పట్టాలతో బ్యాంకులో రుణాలు ఇస్తారని, ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారని, అండగల్ కూడా పేర్లు నమోదు చేస్తారని తెలిపారు. అసైన్‌మెంట్ భూములు కావాల్సిన వారు సీజేఎఫ్‌ఎస్ పట్టాలిచ్చి సంతకాలు చేయాలని సూచించారు. దీంతో సీజేఎఫ్‌ఎస్ పట్టాదారులు వారి పట్టాలను ఇచ్చి అసైన్‌మెంట్ పట్టాలు తీసుకోడానికి ఆర్డీవో వద్ద అంగీకారం తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీవో నాగమణి, వ్యవసాయశాఖ ఏవో శిరీషారెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

చెంగాళమ్మ సేవలో ప్రముఖులు
సూళ్లూరుపేట, జూలై 6 : సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రశేఖర్ దంపతులు, నాయుడుపేట ఆర్డీవో శ్రీదేవి ఉన్నారు. వీరికి ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ ముప్పాళ్ల వెంకటేశ్వర్లురెడ్డి, ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి తీర్ధప్రసాదాలు అందజేశారు. వీరితో పాటు తహశీల్దార్ అద్దంకి శ్రీనివాసరావు, డీటీ రవి, వీఆర్‌వోలు చలపతి, రామకృష్ణ, పాలక మండలి సభ్యులు ఆకుతోట రమేష్ ఉన్నారు.
ఘనంగా చండీయాగం
అదేవిధంగా చెంగాళమ్మ ఆలయంలో మహాచండీయాగాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ యాగాన్ని వైభవంగా నిర్వహించారు.