శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 21: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఫెయిల్ కావడం వల్ల నీరు ఉప్పగా మారుతోందని, ఈ పరిస్థితుల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో పంచాయితీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జలాశయాల ఆధారిత యాన్యువిటీ పథకానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. అందులో భాగంగా జిల్లాలో మొదటి దశలో రూ.1,672 కోట్లతో, రెండోదశలో రూ.728.46 కోట్లతో తాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసినట్లు స్పష్టం చేశారు. సోమశిల జలాశయం ఆధారంగా ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలకు, కండలేరు ఆధారంగా సర్వేపల్లి, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలకు, సంగం ఆనకట్ట ఆధారంగా కోవూరు, కావలి నియోజకవర్గాలతో పాటు నెల్లూరు నగరానికి తాగునీటి పథకాలు అందుబాటులోకి రాబోతున్నట్లు వెల్లడించారు. ఆయా జలాశయాలు డెడ్‌స్టోరేజీలో ఉన్నప్పటికీ తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా పంపింగ్ చేసేలా రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే టెండర్లు పిలిచి ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. అలాగే అక్టోబర్ 12న ఆర్‌అండ్‌ఆర్ కాలనీల నిర్మాణానికి భూమిపూజ చేయబోతున్నామని, నేలటూరుకు చెందిన 309 కుటుంబాల తరలింపునకు రూ.68.10 కోట్లతో మాదరాజుగూడూరులో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. నేలటూరుపాలెంలోని 171 కుటుంబాల తరలింపునకు ధనలక్ష్మీపురం వద్ద రూ.34.70 కోట్లతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలియచేశారు. కోడూరు పంచాయతీ పరిధిలోని 44 ఎకరాల భూమిలో రూ.59.30 కోట్లతో 287 మత్స్యకార కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. వీటికి సంబంధించి కూడా టెండర్ల ప్రక్రియను ఇప్పటికే అధికారులు చేపట్టారని తెలిపారు. ఆర్‌అండ్‌ఆర్ కాలనీల నిర్మాణం పూర్తికాగానే ఆయా గ్రామాల ప్రజలను తరలిస్తామని తెలిపారు. అదేవిధంగా నేలటూరులో పవర్ ప్రాజెక్టుల కాలుష్యం వలన పంటలు పండని కారణంగా రైతుల కోరిక మేరకు వంద ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తామన్నారు.