శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

స్వర్ణాల చెరువును ఎంతో అభివృద్ధి చేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు సిటీ, సెప్టెంబర్ 21 : నెల్లూరు నగరంలోని బారాషాహిద్ దర్గా వద్ద రొట్టెల పండుగ సందర్భంగా స్వర్ణాల చెరువులో టూరిజం క్లబ్ ఏర్పాటుచేసిన సింహపురి బోటును పురపాలక శాఖ మంత్రి నారాయణ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బారాషాహిద్ దర్గా, స్వర్ణాల చెరువు, రొట్టెల పండుగ ఎంతో పవిత్రమైనవని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, ప్రత్యేకంగా స్వర్ణాల చెరువు వద్ద ఎంతో అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోందని, బారాషాహిద్ దర్గాపై ఉన్న విశ్వాసం, స్వర్ణాల చెరువులో రొట్టెలు వదలడం, రొట్టెలను పట్టుకోవడం వల్ల వారు కోరుకున్న కోర్కెలు నెరువేరుతాయని ఎన్నో ఏళ్లనుంచి వస్తున్న నమ్మకంతో భక్తుల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. నెల్లూరు నగర అభివృద్ధికి తమ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తోందని, అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా వాటిని ప్రజలు నమ్మరని అన్నారు. 279 జీవోను రద్దు చేయాలని మున్సిపల్ కార్మికులు గతకొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నారని, అయితే 50 మున్సిపాలిటీలలో 279 జీవోను అమలు చేశామని, ఈ జీవో వలన ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అబ్దుల్ అజీజ్, టీడీపీ నగర ఇన్‌చార్జ్ ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, ఆనం జయకుమార్‌రెడ్డి, కిలారి వెంకటస్వామి నాయుడు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించిన ఎస్పీ
నెల్లూరు, సెప్టెంబర్ 21: నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండుగలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ సత్యయేసు బాబు శుక్రవారం పర్యవేక్షించారు. దర్గాను సందర్శించిన ఆయన అక్కడ ఉన్న పోలీసు అధికారులకు బందోబస్తు, ఇతర విషయాల గురించి తగు సూచనలిచ్చారు. అక్కడినుంచి ఘాట్‌లను సందర్శించి బందోబస్తును పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ విభాగంలో సీసీ కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయన్నది తిలకించి టెక్నికల్ సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.