శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఎటూచూసిన జనప్రవాహమే నాలుగో రోజూ తగ్గని భక్తుల రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు సిటీ, సెప్టెంబర్ 24: రొట్టెల పండుగతో నెల్లూరు నగరంలో కోలాహలం నెలకొంది. నాలుగోరోజూ నగరవాసులతో పాటు జిల్లావాసులు అధికసంఖ్యలో దర్గాను సందర్శించి రొట్టెలు మార్చుకున్నారు. సోమవారం స్పీకర్ కోడెల శివప్రసాద్, ఎమ్మెల్యేలు, వైకాపా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితర రాజకీయ నాయకులు దర్గాను సందర్శించి రొట్టెలు మార్పిడి చేసుకున్నారు. పోలీసులు చాలా ఓర్పుతో భక్తులకు వీఐపీల రాకవల్ల ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. రొట్టెల మార్పిడి ఘాట్‌ల వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాలతోపాటు ఇతర దేశాల నుంచి కూడా భక్తులు భారీగా వచ్చారు. నగర కార్పొరేషన్, పోలీసు, ఫైర్, రెవెన్యూ, విద్యుత్‌శాఖ అధికారులు కూడా రేయింబవళ్లు దర్గా వద్ద పనిచేస్తున్నారు.
కోర్కెలు తీర్చే దర్గా బారాషహీద్ దర్గా : కోటంరెడ్డి
అనుకున్న కోర్కెలు తీర్చే దర్గాగా నెల్లూరు బారాషహీద్ దర్గా పేరుగాంచిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన దర్గాను సందర్శించి ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన గతంలో తాను కోరుకున్న కోరిక నెరవేరడంతో రొట్టెను వదిలారు.
రొట్టెల పండుగ నెల్లూరుకే గర్వకారణం
- ఆనం రంగమయార్‌రెడ్డి
నెల్లూరులోని స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ జరుపుకోవడం నెల్లూరు ప్రజలకు గర్వకారణమని వైకాపా కార్పొరేటర్ ఆనం రంగమయార్‌రెడ్డి అన్నారు. రొట్టెల పండుగలో సోమవారం పాల్గొన్న ఆయన జగన్ ముఖ్యమంత్రి కావాలని, ఆనం రామనారాయణరెడ్డి ఎమ్మెల్యే కావాలని రొట్టె పట్టుకున్నట్లు చెప్పారు.