శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నేలపట్టును సందర్శించిన కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దొరవారిసత్రం, సెప్టెంబర్ 24: వలస పక్షుల సంతానోత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన నేలపట్టు పక్షుల కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు సందర్శించారు. పక్షుల కేంద్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించి పలు సూచనలు అందించారు. రిసార్ట్‌ల మధ్య ఖాళీ ప్రదేశాల్లో పూలమొక్కలను పెంచి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సూచించారు. దొరవారిసత్రం నుంచి పక్షుల కేంద్రాలకు వచ్చే మార్గాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రానున్న ఫ్లెమింగో ఫెస్టివల్‌ను దృష్టిలో ఉంచుకుని పర్యాటకులను ఆకర్షించేందుకు నేలపట్టులో తగిన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ వెంట నాయుడుపేట ఆర్డీవో శ్రీదేవి, జిల్లా పర్యాటకశాఖ అధికారి శ్రీనివాసకుమార్, ఏఈ రంగయ్య తదితరులు ఉన్నారు.

శ్రీసిటీ సలహాదారు మధురెడ్డి మృతి
సత్యవేడు, సెప్టెంబర్ 24: శ్రీసిటీ సలహాదారుడు పనమాల మధురెడ్డి ఆదివారం రాత్రి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నెల్లూరు జిల్లాసూళ్లూరుపేట సమీపంలో గల కోటకొల్లూరు గ్రామంలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సోమవారం స్నేహితులు, బంధువులు, శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి సహా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రవీంద్రసన్నారెడ్డి మాట్లాడుతూ మధురెడ్డి మృతి శ్రీసిటీకీ, తనకు తీరని లోటన్నారు. శ్రీసిటీ ఆవిర్భావం నుండి అభివృద్ధికి ఆయన ఎనలేని సేవలు అందించారన్నారు. మంగళవారం ఉదయం కోటకొల్ల్లూరులోని మధురెడ్డి స్వగృహం నుండి ఆయన అంతిమయాత్ర జరుగుతుందని తెలిపారు.

కామాక్షమ్మా..జగన్‌కు శక్తినివ్వు
* మాజీ ఎంపీ మేకపాటి
బుచ్చిరెడ్డిపాళెం, సెప్టెంబర్ 24: ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు అహోరాత్రులు శ్రమిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మరింత శక్తిని ప్రసాదించాలని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిలు జొన్నవాడ కామాక్షితాయిని వేడుకున్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడ గ్రామంలో గల శ్రీమల్లికార్జున స్వామి కామాక్షితాయి ఆలయాన్ని వారివురు సోమవారం దర్శించుకున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి మూడువేల కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా స్వామి అమ్మవార్లకు మూడువేల కొబ్బరికాయలు సమర్పించారు. అనంతరం విలేఖర్ల సమావేశంలో పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆదరణ పొందుతోందని, జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రతో అది రెట్టింపు అయ్యిందని అన్నారు. ఇప్పటివరకు ఏ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రజా సమస్యలపై ఇన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరగలేదని, జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలోని సభ్యులు మాత్రమే ప్రజల కోసం ఆలుపెరగని కృషి చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడాల్సివ అవసరం వచ్చిందన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా పార్టీలోని అందరు ఎంపీల చేత రాజీనామాలు చేయించి ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని చెప్పారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పాలనపై ప్రజలు విసిగిపోయారని అన్నారు. వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి రాబోయే ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, తెలుగుదేశం పార్టీ ఐదేళ్లలో చేసిన అవినీతిని బయటకు తీస్తారని తెలిపారు. ఈ సందర్భంగా వైకాపా నాయకులు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా జిల్లా రైతు విభాగం అధ్యక్షులు సూరా శ్రీనివాసులరెడ్డి, మల్లారెడ్డి, బాలశంకర్‌రెడ్డి, చీమల రమేష్, నల్లబోలు సుబ్బారెడ్డి, బెజవాడ గోవర్దన్‌రెడ్డి, మావులూరు శ్రీనివాసులురెడ్డి, వెంకటేశ్వరనాయుడు, నిరంజన్‌రెడ్డి, కల్యాణ్‌రెడ్డి, చర్లో సతీష్‌కుమార్‌రెడ్డి, మహబాబ్‌బాష, బాలకృష్ణ, సాగర్, మురళీ తదితరులు పాల్గొన్నారు.