శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఆగ్రహించిన రైతాంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, సెప్టెంబర్ 24 : ప్రభుత్వ నిధులు మంజూరైనప్పటికీ చెరువు తూము మరమ్మతు పనులు చేపట్టకుండా నాలుగేళ్లుగా కాలయాపన చేసి తమ భూములను ఎడారిగా మార్చారని గుడిపాడు గ్రామ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా సోమవారం స్థానిక జల వనరులశాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయానికి రైతులు తాళం వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఎస్‌పేట మండలంలోని గుడిపాడు గ్రామ చెరువు 2వ నంబరు తూములు శిలావస్థకు చేరాయన్నారు. తూముల మరమ్మతు పనులకు నీరు-చెట్టు పథకం కింద ప్రభుత్వం ఏడాది క్రితం సుమారు రూ.10 లక్షలు నిధులు మంజూరు చేసిందన్నారు. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ తూములకు మరమ్మతులు చేయకుండా పత్తాలేకుండా పోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి ఇచ్చిన వర్క్ ఆర్డర్ రద్దు చేసి సమర్థుల చేత పనిచేయించాల్సిన అధికారులు గుత్తేదారుకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. తమ సమస్య చెప్పుకునేందుకు జిల్లా కలెక్టర్ నుంచి మండల స్థాయి అధికారుల వరకు కాళ్లరిగేలా తిరిగినా పరిష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రూ.4 లక్షల పనికి రూ.9.80 లక్షలు మంజూరైనా తూము పనులు ప్రారంభం కాలేదన్నారు. మొదటి పనినే చేపట్టని అదే కాంట్రాక్టరుకు అధికారులు రూ.2.5 కోట్ల చెరువు పనిని ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేయకుంటే వర్క్ ఆర్డర్ రద్దు చేసి ప్రభుత్వం ఆధ్వర్యంలో పనులు చేపట్టాల్సి ఉందన్నారు. కానీ నిబంధనలు అతిక్రమించిన ఇరిగేషన్‌శాఖ అధికారులు గుత్తేదారులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఆత్మకూరు ఇరిగేషన్ అధికారుల లాలూచీ కారణంగా గుడిపాడు గ్రామ రైతాంగం కనీసం మెట్ట పంటలకు దిక్కులేక అప్పుల్లో కూరుకుపోతున్నట్లు ఆవేదన చెందారు. వర్షాలు వచ్చే సమయంలో చెరువు పనులు చేపట్టి తమ పొలాలకు నీరు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు పట్టుపట్టారు. సుమారు 2 గంటల సేపు నిరసన చేపట్టినా అధికారుల్లో స్పందన రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు కార్యాలయానికి తాళాలు వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంతలో ఏఎస్‌పేట ఇరిగేషన్‌శాఖ ఏఈ పుల్లయ్య ఆత్మకూరు కార్యాలయానికి చేరుకుని రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వారు ససేమిరా అనడంతో ఫోన్ ద్వారా జిల్లా అధికారులతో సంప్రదించి రెండురోజుల్లో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందిన రైతులు నిరసన విరమించారు. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే గుడిపల్లిపాడు గ్రామానికి తరలివచ్చి కార్యాయలాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో జూటూరు వేణుగోపాల్‌రెడ్డి, సిద్దారెడ్డి రమణారెడ్డి, సత్యన్నారాయణరెడ్డి, సిద్దవరపు తిరుపతిరెడ్డి, కుట్టుబొయిన బాదుల్లా, ఆర్మూరు వెంకటేశ్వర్లు, నెల్లూరు కృష్ణారెడ్డి, మాలకొండయ్య, కాటా రవీంద్రరెడ్డి, చిన్నయ్య, డేగా వెంకటరత్నం, షేక్. ఖాజావలి, నాగూరు పిచ్చిరెడ్డి, మంగలపూడి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.