శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వీడిన వృద్ధురాలి హత్య కేసు మిస్టరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి, మార్ఛి 27: పట్టణంలోని ముసునూరు టీచర్స్ కాలనీకి చెందిన వృద్ధురాలు తాటికొండ ఆదెమ్మ హత్య కేసు మిస్టరీ వీడింది. మద్యానికి బానిస అయిన ప్రకాశం జిల్లా రావూరు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కాకు మల్లికార్జున నగల కోసం మరో నిందితుడు వెంకట్రావుతో కలిసి హత్య చేసినట్లు డిఎస్‌పి రాఘవరావు తెలిపారు. ఆదివారం రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్ ఆవరణలో సిఐ మధుబాబు, ఎస్‌ఐలు అన్వర్‌బాషా, ఎంవి రమణ, విశ్రాంత ఎస్‌ఐ నాగేశ్వర్‌రావు, కేసులో పాలుపంచుకున్న పోలీస్ సిబ్బందితో కలిసి నిందితులను విలేఖర్ల ముందు హాజరుపరిచారు. ప్రధాన నిందితుడు కాకు మల్లికార్జున ఇటీవలి వరకు హైదరాబాద్ నగరంలో జ్యూస్ వ్యాపారం చేసుకుంటూ జీవించేవాడని, నెల రోజుల క్రితం తన స్వస్థలమైన ప్రకాశం జిల్లా రావూరు గ్రామానికి వచ్చేసి ఆటోను కొనుగోలు చేసి నడుపుకుంటున్నట్లు తెలిపారు. హతురాలు ఆదెమ్మ తన ముని మవవడికి తాయత్తు తెచ్చే నిమిత్తం ఈనెల 22వ తేదీన చేవూరికి వెళ్లి తిరుగు ప్రయాణంలో నిందితుల ఆటో ఎక్కినట్లు వివరించారు. ఆటోలో ప్రధాన నిందితుడితోపాటు వెంకట్రావు అనే మరో వ్యక్తి ఉండగా వృద్ధురాలికి ఉన్న గాజులు, కమ్మలను దోచుకునేందుకు మార్గమధ్యంలో పథకం వేసి జాతీయ రహదారి వెంట నిర్జన ప్రదేశంలో ఆమెను రాడ్‌తో కొట్టి రెండుగాజులు, కమ్మలను నిందితులు దోచుకున్నారని తెలిపారు. అనంతరం వారు వృద్ధురాలిని పరిశీలించగా మృతిచెందినదని రూఢీ చేసుకుని మృతదేహాన్ని బుడంగుంట క్రాస్ రోడ్డు సమీపంలో సమ్మర్ టాంక్‌కు వెళ్లే రోడ్డులో జమ్ములో పడేసి పోయారని తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేసినట్లు వివరించారు. అయితే 24 గంటలలోనే ప్రాధమికంగా అంచనాకు రాగా, నిందితులను గుర్తించి ఆదివారం ప్రకాశంజిల్లా మోచర్ల గ్రామం వద్ద అరెస్టు చేశామని తెలిపారు. దొంగిలించిన ఆభరణాలలో గాజులు ఇత్తడివి కాగా,
కమ్మలు మాత్రమే బంగారమని, వాటిని పట్టణంలో ఒ బంగారు దుకాణంలో తనఖా పెట్టారని వాటిని కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అలాగే ఘటనా స్థలంలో ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. సులభంగా సంపాదించాలన్న దురాలోచన, మద్యం మత్తులో వృద్ధురాలిని దారుణంగా హత్యచేశారని తెలిపారు. కాగా, దర్యాప్తులో కీలక భూమిక పోషించిన ఎఎస్‌ఐ సురేంద్ర, హెడ్ కానిస్టేబుళ్లు వెంకయ్య, సత్యం, కానిస్టేబుళ్లు గౌస్ బాషా, అనిల్‌కుమార్, రమేష్, వినోద్, విశ్రాంత ఎస్‌ఐ నాగేశ్వరరావులకు డిఎస్‌పి రాఘవరావు నగదు రివార్డులను అందజేశారు.