శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

హిందూ ధర్మాన్ని రక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటగిరి, నవంబర్ 15: ప్రతిఒక్కరు హిందూ మతాన్ని రక్షించాలని హిందూ దేవాలయ ప్రతిష్ఠాపన పీఠం పీఠాధిపతి శ్రీ కమలానంద భారతీస్వామి పిలుపునిచ్చారు. పట్టణంలోని మదర్ అకాడమీ పాఠశాలలోని కల్యాణ మండపంలో గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం, సమరసత ఫౌండేషన్ సంయుక్తంగా ఆత్మీయ మండల భజన బృందాల ధార్మిక సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కమలానంద భారతీస్వామి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో దేవాలయాలు కేంద్రంగా చేసుకొని సామూహిక హారతి, భజన, పారాయణం మొదలగు కార్యక్రమాలు నిత్యం నిర్వహించాలన్నారు. వెంకటగిరి మండలంలో సమరసత ఫౌండేషన్ ద్వారా గత 2 సంవత్సరాలుగా గ్రామాల్లో దేవాలయాలు కేంద్రంగా అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. హిందువులను చైతన్యపరిచేందుకు మండల స్థాయిలో ఆత్మీయ ధార్మిక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సత్‌ప్రవర్తన కల్గి, పరమతాన్ని వదిలి హిందూ ధర్మాన్ని బతికించాలని ప్రబోధించారు. అనంతరం భజన గురువులను, ఆహ్వాన కమిటీ వారిని సమరసత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా భజన బృందాలచే భజనలు, చిన్నారులచే నృత్యాలు నిర్వహించారు. ఈ ఆత్మీయ మండల భజన బృందాల ధార్మిక సమ్మేళన కార్యక్రమానికి విచ్చేచిన 600 మంది భక్తులకు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఎఫ్ జిల్లా కన్వీనర్ వెంగల్‌రెడ్డి, గిరిజమ్మ, ఉమ, మండల కన్వీనర్లు దామా శేషాద్రి, విజయలక్ష్మి, సుధాకర్, రాంబాబు, రామకృష్ణ, రమేష్, రాజశేఖర్, యారం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
15విజి ఆర్ 4: జ్యోతి ప్రజ్వలన చేస్తున్న శ్రీ కమలానంద భారతీస్వామి