శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఉపాధి హామీ సిబ్బంది బాధ్యతగా పని చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయగిరి, నవంబర్ 15: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సిబ్బంది బాధ్యతగా పనిచేస్తూ కేటాయించిన లక్ష్యాలు సాధించి నెలవారీ సమావేశాల్లో సమగ్ర సమాచారాన్ని అందజేయాలని డ్వామా పీడీ బాపిరెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన స్థానిక స్ర్తిశక్తి భవనంలో ఉదయగిరి ఉపాధి హామీ క్లస్టర్ పరిధిలోని ఐదు మండలాల సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా ఆయన పంచాయతీల వారిగా చేపట్టిన పనుల వివరాలు సమీక్షించారు. క్షేత్ర సహాయకులు కేటాయించిన లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలన్నారు. ఉదయగిరి క్లస్టర్ ఈ లక్ష్యాలను సాధించడంలో వెనుకబడి వుందన్నారు. నిర్దేశించిన లక్ష్యాలు సాధించలేని సిబ్బంది తమకు అవసరం లేదని మరో సమీక్షా సమావేవం నాటికి పనితీరు మెరుగుపర్చుకోవాలన్నారు. సిబ్బంది బాధ్యతారహితంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం కూలీలకు కేటాయించిన 150 రోజుల పనిదినాలు కల్పించిందన్నారు. పనులు చేసే అవకాశమున్నా కొన్ని మండలాల్లో సిబ్బంది పనులు చేపట్టడం లేదన్నారు. పనులకు సంబంధించిన మస్టర్లు ఎప్పటికప్పడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. గృహనిర్మాణ లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకం ద్వారా అందాల్సిన నగదు అందించేందుకు వారి మస్టర్లు సకాలంలో ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. ఏ మండలం నుంచైనా గృహనిర్మాణానికి సంబంధించిన ఉపాధి హామీ పథకం ద్వారా నగదు అందలేదని ఫిర్యాదులు వస్తే అందుకు సంబంధించిన సిబ్బందిని సస్పెండ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. క్షేత్ర సహాయకులుగా తొలగించిన వారి స్థానాల్లో సాంకేతిక సహాయకులను, సీనియర్ మేట్‌ను ఏర్పాటుచేసి పనులు జరిగేలా చూడాలన్నారు. సిబ్బంది నిర్లక్ష్య ధోరణి విడనాడకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. 150 పనిదినాలు కల్పించకుండా విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరించిన ఉదయగిరి మండలం దాసరపల్లి, తిరుమలాపురం, వరికుంటపాడు మండలంలోని టీసీ పల్లి, వింజమూరు మండలంలోని కిస్తీపురం, ఊటుకూరు క్షేత్ర సహాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే ఉదయగిరి ఉపాధి కార్యాలయంలోని ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, వరికుంటపాడు, దుత్తలూరు ఏపిఓలకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. దుత్తలూరు మండలంలోని తెడ్డుపాడు, సీతారామపురం మండలంలోని గుండుపల్లి, నెమళ్లదినె్న, సీతారామపురం, వింజమూరు మండలంలోని జనార్దనాపురం, క్షేత్రసహాయకులను సస్పెండ్ చేశారు. వీరి స్థానంలో సీనియర్ మేట్‌ల ద్వారా పనులు జరిగేలా చూడాలని ఏపిడివోకు సూచించారు. ఈకార్యక్రమంలో ఏపిడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.