శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

దోబూచులాడుతున్న వరుణుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 15: జిల్లాలో ‘గజ’ తుఫాన్ ప్రభావం సాధారణ స్థాయిలో ఉండడంతో జిల్లాలో కొన్నిచోట్ల మాత్రమే వర్షాలు పడుతూ మరికొన్నిచోట్ల ఎండ కాస్తోంది. వర్షాలు పడుతున్నచోట కూడా కొద్దిసేపు వర్షం, తిరిగి ఎండ, మళ్లీ కాసేపు వర్షం.. జిల్లాలో గత 36 గంటల నుండి ఇదే పరిస్థితి నెలకొంది. వాతావరణం మాత్రం చల్లగా ఆహ్లాదకరంగా మారింది. పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. తీరప్రాంతాల్లో కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. జాలర్లు ఎవరూ కూడా వేటకు వెళ్లకుండా ముందస్తు హెచ్చరికలు చేశారు. ఇందుకు భిన్నంగా మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, ఆత్మకూరు, మర్రిపాడు, కలిగిరి, వింజమూరు, సీతారామపురం, వరికుంటపాడు, అనంతసాగరం, కొండాపురం మండలాల్లో చినుకు జాడ కనిపించలేదు. అయితే నెల్లూరు నగరం, టీపీ గూడూరు, ఇందుకూరుపేట, మనుబోలు ప్రాంతాల్లో జిల్లాలోనే అత్యధికంగా 11 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే గూడూరు డివిజన్‌లోని గూడూరు, నాయుడుపేట, ఓజిలి, సూళ్లూరుపేట, తడ, దొరవారిసత్రం తదితర మండలాల్లో ఓ మోస్తరు నుండి భారీ వానలు కురిశాయి. తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న జిల్లాకు చెందిన ప్రాంతాల్లో వానలు ఎక్కువగా కురవగా జిల్లా పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో మాత్రం ఎటువంటి వర్షపాతం నమోదు కాకపోవడం విశేషం. అన్నదాతలు ‘గజ’ తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న జిల్లాలో అతివృష్టి కురిసి వాగులు, వంకలు జలకళ సంతరించుకుంటాయని భావించారు. తీరా తుఫాన్ కాస్త తన గమనాన్ని మార్చుకొని తమిళనాడు వైపు వెళ్లడంతో కనీసం ఓ మోస్తరు వర్షాలైనా కురుస్తాయని భావించిన మెట్టరైతు మోములో చిరునవ్వులు కూడా ఈ తుఫాన్ తీసుకురాలేక పోవడం విచారకరం. అయితే రాబోయే 48 గంటల పాటు జిల్లాకు వర్షసూచన ఉందనే అధికారుల సమాచారం కొంత ఆశను కలిగిస్తోంది.

అగ్రిగోల్డ్ బాధితుల కోసం అవిశ్రాంత పోరాటం
* ఎమ్మెల్యే గౌతంరెడ్డి స్పష్టం
ఆత్మకూరు, నవంబర్ 15: అగ్రిగోల్డ్ బాధితల కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్రాంత పోరాటం చేస్తోందని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు, ఏజంట్ల సంఘాల ప్రతినిధులు ఆత్మకూరులోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యేని కలిసి వినతిపత్రం అంజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడం లేదన్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఇప్పటికి 175 మంది ఎమ్మెల్యేలకు విన్నవించుకున్నట్లు తెలిపారు. కానీ ఏ ఒక్కరూ తమకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మేకపాటి మాట్లాడుతూ అగ్రిగోల్డ్ సమస్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. సమస్యను పరిష్కరించాలని ఎస్‌ఎల్వీ అనే ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించినట్లు తెలిపారు. కానీ ప్రభుత్వం సహకరించలేదన్న కారణంతో ఆ సంస్థ బాధ్యతల నుండి తప్పుకుందన్నారు. ఈ విషయంపై అసెంబ్లీలో చర్చించామన్నారు. బాధితుల తరపున గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీశామన్నారు. జప్తు అయిన అగ్రిగోల్డ్ ఆస్తులు ఎవరి జేబుల్లోకి మళ్లాయో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. అప్పటి వ్యవసాయ శాఖా మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు అగ్రిగోల్డ్ ఆస్తులను సొంతానికి వాడుకున్నారని ఆరోపించారు. తమ నాయకుడు వైఎస్ జగన్ అగ్రిగోల్డ్ బాధితులకు భరోసా ఇచ్చారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ సమస్యను ప్రాధాన్యతాంశంగా తీసుకుంటామన్నారు. సంస్థ యాజమాన్యం ఆస్తులు ఎవరి వద్ద ఉన్నా తమ ప్రభుత్వం స్వాదీనం చేసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 32 లక్షల మంది అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బాధితులంతా వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను బలపరచాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.