శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

దేశానికే ఆదర్శంగా అంగన్‌వాడీ కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 15: రాష్ట్రంలోని అంగన్‌వాడీ పాఠశాలలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. గురువారం స్థానిక అనిల్ గార్డెన్స్‌లో ‘డిజిటల్ క్లాసెస్ ఇన్ అంగన్‌వాడీ ప్రీ స్కూల్స్’ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఒకనాడు పిండి బడులు అనే పేరుతో ఈ కేంద్రాలు నడిచేవనీ, అయితే నేడు వాటి రూపురేఖలను పూర్తిగా మార్చామని, ప్రస్తుతం అవన్నీ కూడా ప్రీ స్కూల్స్ అనే పేరుతో నాణ్యమైన, అధునాతన విద్యాపరికరాలతో విద్యను అందిస్తున్న కేంద్రాలుగా మారాయని అన్నారు. ఇందులో భాగంగా డిజిటల్ తరగతులకు సంబంధించి సామాగ్రిని నేడు జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు అందచేస్తున్నట్లు చెప్పారు. ఈ విద్యను బోధించేందుకు డిజిటల్ స్క్రీన్, ప్రొజెక్టర్ అందుకవసరమైన సుమారు రూ.14వేలు విలువ చేసే మెటీరియల్‌ను అందచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో తొలిసారి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని ప్రీ స్కూళ్లలో ఈ నూతన పద్ధతికి శ్రీకారం చుట్టామని, ఇక్కడొచ్చే ఫలితాలనుబట్టి రాష్టవ్య్రాప్తంగా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోనే నిరుపేదలైన వారికి నాణ్యమైన విద్యను అందచేయాలనే ముఖ్యమంత్రి కన్నకలలను నిజం చేస్తున్నామన్నారు. చిన్నతనం నుండే కార్పొరేట్ విద్యను పేద విద్యార్థుల చెంతకు తీసుకెళితే దాని ఫలితాలు భవిష్యత్తు మీద ఎంతో ఉంటాయని, ఇది రాష్ట్భ్రావృద్ధికి కూడా దోహదపడుతుందన్నారు. విద్యా వ్యవస్థలో వస్తున్న పలు సంస్కరణల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న అనేక సంస్కరణలకు తోడుగా పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, దాతలు పాఠశాలల పర్యవేక్షణ చేపట్టడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. జిల్లాలో రూ.3కోట్ల నిధులను పాఠశాలల అభివృద్ధికి మంజూరు చేసిన కృష్ణపట్నం పోర్టు కంపెనీని మంత్రి అభినందించారు. అంగన్‌వాడీ పాఠశాలల్లోనే కాకుండా మున్సిపల్ పరిధిలో మోడల్‌గా నెల్లూరులో ఏర్పాటు చేసిన పురపాలక రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో 48 మంది పరీక్షలు రాయగా 42 మంది పదికి పది సాధించడం అభినందనీయమన్నారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పట్టుదలతో అత్యధిక మార్కులు సాధించి తమ సత్తా చాటుకున్నారని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత చట్టంలోని అనేక అంశాలను విస్మరించి రాష్ట్భ్రావృద్ధికి కేంద్రం సహకరించకపోయినప్పటికీ రాష్ట్రంలో సీఎం చంద్రబాబునాయుడు ఎంతో కష్టపడి అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని కొనియాడారు. అనేక సమస్యలున్న రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పయనింప చేయడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రం ప్రతి అంశంలోనూ ప్రగతి సాధిస్తుండడం ప్రతిఒక్కరూ గమనించాలన్నారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్ 1 స్థానంలో నిలిచిందని, రాష్ట్రంలో చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్ అమృత, తాగునీరు, ఇళ్ల నిర్మాణం, పేదరిక నిర్మూలన, స్వచ్ఛ సర్వేక్షణ్ వంటి ఎన్నో పథకాలకు కేంద్ర ప్రభుత్వం ర్యాంకింగ్ ఇచ్చిందని, ఇదే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనమని స్పష్టం చేశారు. ఇంత అభివృద్ధి జరుగుతున్నా ఓర్చుకోలేని ప్రతిపక్ష నేతలు కొందరు విమర్శలు చేస్తూ వారి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. దేశంలోనే తొలిస్థానంలో ఉన్నందుకు తాను గర్వపడుతున్నట్లు చెప్పారు. నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ సింధూర నారాయణ మాట్లాడుతూ అంగన్‌వాడీ ప్రీ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశ్యంతో రూ.15లక్షల నిధులతో అందరికీ యూనిఫాం కుట్టించామని, విద్యార్థులు వాటిని ధరించి రావడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. తమ సంస్థ నుండి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఎల్లవేళలా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీనిచ్చారు. జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు మాట్లాడుతూ పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందిస్తున్న మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. తాను పేదరికం నుండే వచ్చానని, తనలాంటి ఎందరో ప్రతిభ కలిగిన విద్యార్థులకు తగిన ప్రోత్సాహాన్నిస్తున్న నారాయణను కొనియాడారు. ఈ సందర్భంగా నెల్లూరులోని అంగన్‌వాడీ ప్రీ స్కూల్ టీచర్లకు, ఆయాలకు డిజిటల్ క్లాసులు నిర్వహించేందుకు సంబంధిత మెటీరియల్‌ను, ప్రొజెక్టర్‌ను మంత్రి అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు అంగన్‌వాడీ కేంద్రాల నుండి వచ్చిన విద్యార్థులు వారి ప్రతిభను ప్రదర్శించారు. చిన్నారులు ఆలపించిన అనేక కార్యక్రమాలు మంత్రిని, ఇతర అధికారులను ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, జాతీయ నేతలు పేర్లను చిన్నారుల చేత చెప్పించడం, నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అబ్దుల్ అజీజ్, విజయా డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, మహిళా కమిషన్ సభ్యురాలు అంచల వాణి, మున్సిపల్ కమిషనర్ అలీంబాషా, కార్పొరేటర్లు పాల్గొన్నారు.