శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అందరూ నిజాయితీగా పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 16: నిజాయితీగా వ్యవహరిస్తూ ప్రజల ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందిస్తూ పనిచేయాలని జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగీ సిబ్బంది, అధికారులకు సూచించారు. కొత్తగా జిల్లాకు కేటాయించబడిన పి ఎస్సైలు, పిఆర్ ఎస్సైలు, మహిళా పిఎస్సైలు మొత్తం 46 మందికి స్వాగతం పలుకుతూ ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు నెలలపాటు ప్రాక్టికల్ శిక్షణాకాలంలో ఉంటారన్నారు. ఫీల్డ్ వర్క్, స్టేషన్ వర్క్, రైటర్‌వర్క్, నైట్ బీట్‌లు, బందోబస్తులు తదితర విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. అందరికీ ఆయా స్టేషన్‌లను కేటాయించడం పూర్తయిందన్నారు. స్టేషన్‌లో ఫిర్యాదుదారుడు చెప్పేది పూర్తిగా విని తరువాతే ఏం చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓ పనితీరును బట్టే కిందిస్థాయి సిబ్బంది నడుచుకుంటారనే విషయాన్ని గమనించాలన్నారు. శాంతిభద్రతల విషయంలో ఉన్నతాధికారుల సూచనలు, సలహాలు పాటించి అవినీతికి పాల్పడకుండా విధులు నిర్వహించాలని హితవు పలికారు. అలాగే పిఆర్ ఎస్సైలు, ఏఆర్ క్వార్టర్ మాస్టర్, ఎస్కార్ట్ ప్రోటోకాల్ తదితర విధులు పూర్తిగా నేర్చుకోవాలన్నారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించకుడా క్రమశిక్షణతో మెలగాలని, ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి పరమేశ్వర్‌రెడ్డి, అదనపు ఎస్పీ (ఏఆర్) వీరభద్రుడు, డీఎస్పీలు మురళీకృష్ణ, కోటారెడ్డి, ఏఆర్ డిఎస్పీ పి రవీంద్రరెడ్డి, ఆర్‌ఐలు చంద్రమోహన్, వౌలాలుద్దీన్, రమేష్ కృష్ణన్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

‘నిబంధనలు తప్పనిసరి తెలుసుకోవాలి’
నెల్లూరు, నవంబర్ 16: మోటార్ వాహనాలు నడిపే వారు మోటార్ వాహన చట్ట నిబంధనలపై కనీస అవగాహన తప్పనిసరిగా కలిగి ఉండాలని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఆదినారాయణ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా ఉపరవాణా కమిషనర్ కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్సుల కోసం హాజరైన అభ్యర్థులకు నిబంధనలపై ఆయన అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు లైసెన్స్ కలిగి ఉండటంతో పాటు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని సూచించారు. కార్లు, ఇతర వాహనాలు నడిపే వారు సీటు బెల్టు ధరించడం అలవాటుగా చేసుకోవాలని, దీనివలన ప్రమాదాల సమయంలో మరణాలు సంభవించే అవకాశాలు ఉండవన్నారు. రోడ్లపై వాహనాలు నడిపే సమయంలో తమ వాహనాలను సరిగా డ్రైవ్ చేయడంతో పాటు ఎదుట, పక్కన వచ్చే వాహనాలను పరిశీలిస్తూ ముందుకు సాగాలని సూచించారు. డీటీసీ శివరాంప్రసాద్ సూచనల మేరకు డ్రైవింగ్ పరీక్షలకు హాజరయ్యే వారికి ముందస్తు జాగ్రత్త చర్యలు, మోటార్ చట్ట నిబంధనలపై స్వల్ప అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పరీక్షకు హాజరైన అభ్యర్థులకు నిబంధనలు, జాగ్రత్త చర్యలకు సంబంధించి ముద్రించిన కరపత్రాలను ఆయన అందచేశారు.